స్త్రీ ధర్మం- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బాల్య దశ నుంచి యువతిగా పెరిగిన ఆమె  తన తల్లిదండ్రులను గౌరవించట్లే అత్తమామలను గౌరవించడం  ప్రథమ స్థానం తన భర్తకు ఇవ్వడం  అన్నపానాలు దగ్గర నుంచి వారు చేసిన తరువాతనే ఆమె చేయడం  అంతకుముందు ఎవరూ చెప్పని సాద్వి లక్షణాలు అన్నీ కూడా  తూచా తప్పకుండా చేయడానికి సిద్ధపడుతుంది  మొట్టమొదటి గుణం సహనాన్ని పెంచుకోవడం  ఎవరైనా పొరపాటున నోరు జారి ఒక మాట అన్న  దానిని పట్టించుకోకుండా బాధపడకుండా తిరిగి మాటలాడకుండా వాదు లేకుండా  చేయగలిగే స్థితిని  తన మనసుకు  నచ్చచెప్పి దానిని తన సొంతం చేసుకుంటుంది  బంధుమిత్రులు ఎవరు వచ్చినా  వారికి కావలసిన సకల గౌరవ మర్యాదలను ఇచ్చి  వారి మెప్పును కూడా పొందే స్థితిలో ఉంటుంది  ఆ గృహిణి  గృహిణి అంటేనే ఆ గృహానికి అధిపతి. ఆమె  ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అన్న నానుడి కూడా  ఆమె ప్రవర్తన వల్లనే వచ్చింది.
పరిణతి చెందిన  పరిపూర్ణ స్త్రీగా ఆవిర్భవించిన తర్వాత  తన సంసార జీవితంలో  సంతానం కోసం ప్రయత్నం చేస్తూ  తాను గర్భవతి అయిన దగ్గర నుంచి  తన పేరును స్వార్థకం చేసుకుంటుంది  స్త్రీ అంటే స.ర.త.ఈ ఈ అన్న అక్షరాలతో కూడి ఉన్నది అని అర్థం  సాత్విక రాజస తామసాలను  తగిన పాళ్ళలో ఆ బిడ్డకు  అందేలా ప్రయత్నం చేయడం  సాత్వికం రా  రాజసం  తాత మోసం  ఈ మూటిని తగుపాళ్ళలో ఉంచడానికి ఈ కారం అంటే ఏడుపు  అంటే ప్రయత్నం  దానిని సఫలీకృతం చేసుకుంటుంది ఆ సాధ్వి ఈ మార్పులు  మగవాడికి ఉంటాయా  ఆడవారికి ఉండవలసిన ఆరు లక్షణాలను  మనువు మహర్షి నిర్వచించడం స్త్రీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది  పనిచేయడంలో కానీ  భర్తకు సలహాలు ఇవ్వడంలో కానీ  భూదేవి లాంటి క్షమను  పొంగటం కానీ  బిడ్డలకు  తల్లి ఎలాగో ఈ కుటుంబానికి ఆమె అలా  మాతృమూర్తిగా వ్యవహరించడం ఆమెకే చెల్లు. నిజానికి ఏ ఇంటిలోనైనా  మీరు నిశితంగా పరిశీలించినట్లయితే  ఆడవారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయా మగవారికి కుంటాయా  కుటుంబాన్ని పోషించడానికి ధనం అవసరం దానిని సంపాదించడం కోసం  పురుష ప్రయత్నం ఉంటుంది తప్ప  వాడు సంపాదించి తీసుకువచ్చిన ప్రతి పైసా లెక్కకు  ఎంతో పొదుపుగా ఈ కుటుంబాన్ని గడిపేటువంటి బాధ్యత భార్య తీసుకుంటుంది తప్ప భర్త కాదు కదా  సంపాదించింది నేనయితే ఖర్చు చేయడానికి నీవు ఎవరు అనే ధైర్యం ఏ మగవాడికైనా ఉంటుందా  నిజంగా ఒకవేళ ఆ హక్కును అతనికి ఇస్తే  నెల రోజులలో ఖర్చు చేయవలసినది పది రోజులలో ఖర్చు చేసి మిగిలిన 20 రోజులు ఆ కుటుంబాన్ని పస్తులతో మలమల మాడేలా చేయడాపురుషుడు  గుట్టుగా బాధ్యతగా వ్యవహరించగలిగినది గురిహిని మాత్రమే గృహస్తు కాదు అన్న విషయం స్పష్టం.



కామెంట్‌లు