అమ్మ;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 ఈ ప్రపంచంలో పుట్టిన జీవరాశి ఏదైనా  తల్లి గర్భంలో కొంతకాలం ఉండడం తర్వాత భూమి మీదకు రావడం పెరగడం తాను చేయవలసిన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించి  తిరిగి తను ఏ భూమి నుంచి వచ్చాడో దానిలో కలిసిపోవడం  మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసే మానవ జీవితం ఏదైనా ఒకే పద్ధతిలో సాగుతూ ఉంటుంది  అయితే తర్వాత ఎలా వస్తున్నాయి  వీటిని ఎవరు సృష్టించారు ఇలా రావడానికి కారణాలు ఏమిటి ఒక్క క్షణం మనం ఆలోచించినట్లయితే  ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన నలుగురు బిడ్డలను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే నలుగురు ఒకే పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారా లేదా అన్న విషయాన్ని గమనించండి
భోజనం దగ్గర కూర్చున్నప్పుడు తల్లి వడ్డించే పదార్థాలు  ఆమె అందరికీ సమానంగా  వేస్తున్న కొంతమంది  ఎక్కువ తీసుకునేవాడు ఉంటారు మరి కొంతమంది తక్కువ తీసుకునేవారు ఉంటారు ఆ పద్ధతి తల్లికి తెలుస్తుంది ఎవరు ఎంత  కావాలనుకుంటారో అన్న విషయం దానిని చూసి మిగిలిన వారు ఎలా ఆలోచిస్తారు అక్కడ ఎందుకు తక్కువ ఇక్కడ ఎందుకు ఎక్కువ అన్న విషయం వారికి తెలియదు  ఏదైనా తెలియని విషయం మనసులోకి వచ్చినప్పుడు దానిని గురించిన ఆలోచనలు పరిపరి విధాలలో ఉంటాయి  అసలు విషయం తెలియదు ఊహ మాత్రమే  అలాంటప్పుడు ఫలితం ఒక రకంగా రాదు రకరకాల సమాధానాలు వస్తూ ఉంటాయి  దీనికి కారణం ఏమిటి. మనలో కొంతమందిని చూస్తూ ఉంటాం  ఇవాళ ఏ కార్యక్రమాలు జరగాలన్న ఒక బ్రాహ్మణ  శ్రేష్టిని పిలిచి ఆ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటాం అది శుభకార్యము కావచ్చు అశుభ కార్యము కావచ్చు  ఏ కార్యానికి ఎలా చేయాలి? ఏం చేయాలి ఎలాంటి శ్లోకాలను  ఆధారం చేసుకుని  ఏ గ్రంథంలో ఇది చెప్పబడి ఉన్నదో ఆ విషయాన్ని సమగ్రంగా చెప్పగలిగిన వాడు మాత్రమే  ఆ కార్యక్రమానికి అర్హుడు అవుతాడు  కానీ కొంతమంది అజ్ఞానంతో  ప్రతిదానికి జంజపు వాళ్ళనే పిలవడానికి కారణమేమిటి వాళ్ళు ఎవరైనా దివి నుంచి పుట్టుకు వచ్చారా  మనకన్నా తక్కువ కులంలో ఉన్న వాళ్ళు తక్కువ జాతిలో ఉన్న వాళ్ళు  మనతో పాటుగా వచ్చి చదువుకోడానికి ఏమాత్రం అర్హులు  వారిని మనం ఎందుకు  అనుమతించాలి అన్నవారు లేకపోలేదు


కామెంట్‌లు