పుస్తక పఠనండా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.6302811961.
 నిజంగా పుస్తకాలు చదవాలి అన్న జిజ్ఞాసతో  ఉన్న వ్యక్తులు మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు  డాక్టర్ అంబేద్కర్ గురించి చెబుతూ  లండన్ లో ఉన్న  గ్రంథాలయంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదివాడు  అని చెబుతారు  నాకు తెలిసి విశాఖపట్నంలో నేను ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు  నా ఆత్మీయ మిత్రుడు మధుసూదన్  తన డ్యూటీ ప్రకారం రేడియోలో తన పని తాను చేసుకుని  మిగిలిన సమయం మొత్తం విశాలాంధ్ర పుస్తక ఆవరణలోనే  గడుపుతాడు  నేను ఒకసారి చలం గారి పుస్తకం  ఒకటి కావలసి విశాలాంధ్రలో మొత్తం వెతికిన నాకు కనిపించలేదు  ఆ మాట మధుసూదన్తో చెప్తే  మీరు ఈసారి వెళ్ళినప్పుడు రెండో వరుసలో ఉన్న బీరువాలలో రెండవ బీరువా మధ్యలో  ఆ పుస్తకం ఉంటుంది తీసుకోండి అని సలహా ఇచ్చాడు. అంటే మధుసూదన్ విశాలాంధ్రలో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదివి  దాని సారాన్ని కూడా చెప్పగలిగేలా  తయారు కావడానికి కారణం  పుస్తకాల పై ఉన్న శ్రద్ధ  కొత్త విషయాలను తెలుసుకోవాలి అన్న  అభిప్రాయం  విశాఖపట్నంలో జరిగే  సాహిత్య కార్యక్రమాలు అన్నిట్లోనూ తాను పాల్గొంటూ  రచయితలతో కవులతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ ఆకాశవానికి సంబంధించిన కార్యక్రమాలకు ఫలానా విషయాని గురించి మాట్లాడాలి అని అనుకుంటే దానికి పలానా వారు  సరిపోతారు  వారిని సంప్రదించండి అని చెప్పగలిగిన  జ్ఞానం అతనికి ఉంది  ఎవరికైనా  ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలని మనసులో అనుకొని దానిపై శ్రద్ధతో పని చేస్తారో అది తన సొంతం అవుతుంది అని వీళ్ళు రుజువు చేస్తారు. కనుక ప్రతి తల్లి  తన బిడ్డ బాగా చదవాలని కోరుకోవడంతో పాటు పాఠశాలలో చెప్పే పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా తెలుసుకునే  పుస్తకాలను చదివించే బాధ్యత తాను తీసుకోవాలి  ప్రతిరోజు ఏదో ఒక దినపత్రిక ఇంటికి వచ్చేలా చూసుకుంటే  తన కుమారునితో అవి చదివేలా చేస్తే  లోకజ్ఞానం పెరుగుతుంది  ఎవరు ఎలాంటి వారు తెలుస్తుంది  ఏ మనస్తత్వం కలిగిన వాడు ఈ దేశాన్ని పరిపాలించడానికి అర్హుడో అర్థం చేసుకోగలిగిన  శక్తి సామర్థ్యాలు తనకు సిద్ధిస్తాయి  అలాకాకుండా ఒట్టి పాఠాలనే ముక్కునా పెట్టుకుని  పరీక్షలలో చీదివేస్తే  దానివల్ల ఏమిటి ఫలితం ఉంటుంది  కనుక జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే తల్లి దానికి బాగా సహకరించాలి  అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి  దానితో అతను చదువుతున్నాడా లేదా అన్న విషయం తెలుస్తోంది  అది తల్లి బాధ్యత.



కామెంట్‌లు