తల్లి పెంపకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.6302811961.
 జీవితంలో స్థిరపడడానికి ఉన్నతమైన జీవిత  రహదారిలో హాయిగా ప్రయాణం చేయడానికి  స్త్రీ పురుష లింగ బేధం లేదు  ధనవంతులు అన్న తేడా కనపడదు  ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న  చిన్నారి శ్రీపతి అన్న పేరుతో ఉన్న  పాప  చదువు అంటే ప్రాణం ఇచ్చే  తత్వం  కానీ ఆ గిరిజన కుటుంబాలలో చదువడానికి ప్రతి ఒక్కరు  విరోధమే  ఆ గ్రామంలో చదువుకున్నవాడు ఒక్కడూ లేడు దానికి ప్రధాన కారణం అక్కడ బడి లేకపోవడం  చదవాలి అన్నది ప్రయాణి ఏ ఒక్కరూ ఆ పిల్లలకు కలగచేయకపోవడం  కానీ బేబీ శ్రీపతి  తాను చదవడం కోసం తల్లిదండ్రులను ఒప్పించి  తన గ్రామంలో నుంచి బడి ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ చదివి  ఆ తరువాత లా  తన చేతిలోకి తీసుకుంది. చదువు మధ్యలోనే  పరిస్థితుల ప్రభావం కావచ్చు తల్లిదండ్రుల కోరికపై కావచ్చు  వివాహం చేసుకోండి  లా పరీక్షలు  జరిగే సమయానికి ఆవిడ  ప్రసవించే రోజులు అని తెలిసి కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళింది  తాను పండంటి ఆడపిల్లను  ఆ కుటుంబానికి ఇచ్చి ఎంతో దూరంలో ఉన్న  యూనివర్సిటీ కి వెళ్లి పరీక్షలు రాసి ఉత్తమ శ్రేణిలో  తాను విజయాన్ని సాధించింది  జీవిత ఆశయం నెరవేరింది  గిరిజన తెగలలో మొదట లాయరుగా వచ్చినది  శ్రీమతి శ్రీపతి మాత్రమే  ఆమెను జూనియర్  జడ్జిగా  ప్రభుత్వం నిర్ణయించి ఆమెకు తగిన స్థానాన్ని ఇచ్చి గౌరవించింది  పట్టుదల ఉన్న ఏ బాల అయినా  అంకితభావంతో చేస్తే తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అన్నదానిని  కార్యరూపంలో చూపిన శ్రీపతి  అభినందనీయురాలు. పుస్తకం హస్తభూషణం  అని సామెత  ఎవరి చేతిలో అయినా ఎప్పుడు చూసినా పుస్తకం ఉంటే అతనిని అలా పిలుస్తారు  ఆ పుస్తకం అనేది చేతికి ఆభరణం లాంటిది  దీనిలో రెండు అర్థాలు కనిపిస్తాయి  మనకు మొదటిది  అతను ఎక్కడికి వెళ్లినా పుస్తకం పట్టుకొని  చదువుతూనే ఉంటాడు చివరకు సినిమాకు వెళ్లిన  ఆ వెలుగులో పేజీలు తిప్పుతూనే ఉంటాడు  చదువు మీద అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అని చెప్పడానికి  అలా అంటారు  మరి కొంతమంది  చదవడానికి బద్ధకించేవాడు చాలామంది  పుస్తకం పట్టుకొని ఉంటారు  ఎవరైనా ప్రశ్నిస్తే నేను ఎప్పుడూ చదువుతూనే ఉంటాను చూస్తున్నారు కదా నా చేతిలో పుస్తకం ఉంది అంటాడు  చేతికి ఒక ఆభరణం లాంటి గడియారం అలాంటివి ఉంటే  దానిని అలంకారం అంటాం ఈ పుస్తకం కూడా అలాంటిదే అని రెండవ  అర్థం.



కామెంట్‌లు