అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ముందుగా అగస్త్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న ఎత్తాకి కొయ్య రథం రథశాల రెడ్డి గారిని ముందు ఆకర్షించాయి ఆలయంలోపల ఉన్న రధశాలలోకి వెళ్లి రథాన్ని పరిశీలించారు చక్కటి రథం శిల్ప శాస్త్రాన్ని అనుసరించి ఒక ఆలయం మాదిరిగా కొయ్య శిల్పులు అందంగా తీర్చిదిద్దారు దానిని కనీసం 200 సంవత్సరాల నాటిది. ఎత్తైన చక్రాలు పొడుగాటి  ఇరుసులు దేవుని ఉత్సవ విగ్రహాలను అమర్చడానికి ఏర్పాట్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా లాగడానికి లావాటి మోకులు ఆపటానికి బ్రేకులు రథ నిర్మాణ శాస్త్ర నిపుణుల పనితనానికి అద్దం పడుతున్నాయి. చుట్టూ కలయ తిరిగిన రెడ్డి గారికి ఆగస్త్యేశ్వర రథశాలను  రథశాలకు గద్దెవారు తెలుగువారు ఇటుకకు ధర్మం 500 రూపాయలు కొలకలూరు 17-2-49 అని రాసిన బోర్డు కనిపించింది 73 ఏళ్ల క్రితం కమ్మవారు తెరగవారు కాపులు కలిసి రథశాలను నిర్మించారు అని తెలిసి కులాల మధ్య గల సఖ్యత అలనాటి జ్ఞాపకం గా మిగిలిపోయిందే అని అనుకున్నారు రెడ్డి గారు.
ఆలయం ప్రవేశ ద్వారం ముందు మునిపటి ఆలయాన్ని ఊడదీసి కాకతీయ కాలపు ఎర్ర ఇసుకరాయి (కచ్చితంగా వేజండ్ల క్యారీ నుంచి తెచ్చినదే) అందంగా చెక్కిన ద్వార శాఖ దానిపైన సారు వాకు వాడిన సరివి కట్టెలు కనిపించాయి కొత్త ఆలయాన్ని కట్టడంలో ఉన్న శ్రద్ధ పురాతన కళాఖండాలను భద్రపరుచుకోవాలన్న విషయంలో లేదే అని బాధ కలిగింది రెడ్డి గారికి అంతేకాదు లక్ష్యంతో పాటు నిర్లక్యం కూడా పుట్టినదేమో అని కూడా వారికి మనసులో అని పించడం సహజం  రథశాల దాటి దాని కుడివైపున ఒక అరుగు దాని మీద ఒక అస్పష్ట శాసనం కనిపించిన రెడ్డి గారికి పరీక్షించి  చూస్తే  క్రీస్తుశకం 1202వ సంవత్సరంలో అగస్త్యేశ్వర మహాదేవుని సానిమాన్య నిబంధనలకు అమరి నాయుడు  రెండు పుట్ల భూమిని దానం చేసిన వివరాలు తెలిసినాయి.
ఆలయ వ్యవస్థలో స్వామివారికి అంగరంగవైభవాలు జరుపుతారు స్వామివారిని అలంకరించి అర్చనలు చేయడానికి అంగ భోగమని స్వామి వారిని నృత్యం గీతాలతో సేవించడానికి రంగ భోగమని అంటారు అంగరంగ భోగంగా వెలుగొంది అన్నమాట అలా పుట్టుకొచ్చిందే ఆ శాసనం క్రీస్తు శకం 1202 నాటికి అప్పుడు కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కొత్తగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఆయనకు ఈ ప్రాంతంలో చెందోలు (సనదుప్రోలు) రాజధానిగా వెలనాటి పృధ్వీశ్వరుడు క్రీస్తుశకం 1186-1210 సామంత మాండలికుడిగా పాలిస్తున్నారు ఈ శాసనంలో స్థానికుడైన ఒక అమరి నాయుడు ఆలయంలో నృత్య భోగాన్ని సమర్పించే సానుల కోసం గుడిసాని అనే పదం ఇలా పుట్టిందే.


కామెంట్‌లు