బాల్యం దాటి యవ్వనంలోకి వచ్చేసరికి ఎన్ని కోరికలు మెదడులో ఉద్భవిస్తాయో తనకే అర్థం కాని స్థితి ఒకొక్క కోరిక ఒక అద్భుతమైన విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. దానిని పొందాలి అని ఆరాటపడతాడు కానీ తన స్తోమత దానికి తగినట్లుగా ఉందా లేదా అన్న విషయాన్ని ఆ క్షణాన గమనించడు తాను వివాహం చేసుకోవాలనుకున్న వనితను గురించి ఎన్నో ఊహించుకొని ఇలా ఉండాలి అలా ఉండాలి అంత అందగత్తె కట్న కానుకలతో వచ్చేదై ఉండాలి అనుకున్న వాడికి అలాంటి అమ్మాయి దొరుకుతుందా అలా కలకనే వాడి స్థితిని గురించి అవతల ఆ అమ్మాయి ఆలోచించదా ఏమీ లేని వాడిని చూసి అసహ్యించుకుంటుంది తప్ప వివాహం చేసుకోవాలనుకుంటుందా అందుకే వీటిని పగటి కలలు అంటారు. మనం ఏ కాలంలో నివసిస్తున్నామో మనకు తెలుస్తుందా గతంలో నా భవిష్యత్తులోన వర్తమానంలోనా గడిచిపోయిన కలవవలసిన కాలం గురించి మనకు దేనికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలం వర్తమానంలో జీవిస్తున్నాను అని అనుకున్న మరుక్షణంలో ఆ క్షణం గతం అయిపోతుంది కదా అంటే గతంలో ఉన్నావా నీవు ఆలోచించే విషయాన్ని గురించి రాబోయే క్షణం భవిష్యత్తు అవుతుంది కదా అలా ఆలోచించే సమయాల్లోనే వర్తమానం లోకి వస్తున్నావు కదా కనుక ఏ కాలంలో నీవు జీవిస్తున్నావు అన్న విషయం నీకే అర్థం కాని విచిత్రమైన స్థితి ఈ గతించిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము రాబోయే కాలం ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. కనుక తన గురించి ఆలోచించవద్దు కారణం అది తిరిగి రానిది నీవు తెచ్చుకోలేనిది అలాగే భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నావు అది కాలానుగుణంగా జరగవలసినదే తప్ప నీవు అనుకున్నట్లుగా జరగదు కనుక వర్తమానంలో జీవించడానికి సిద్ధపడి ఉండమని మన పెద్దలు మనకు ఉపదేశిస్తూ ఉంటారు. ఈ క్షణాన మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకోదలచుకున్నామో దానిని క్షుణ్ణంగా తెలుసుకున్నాం అంటే భవిష్యత్తుకు లోపం ఉండదు అని అర్థం కనుక నీ ఈ వయసులో అంటే చదువుకునే వయసులో చదువుతూనే జీవితాన్ని కాలక్షేపం చేయాలి మిగిలిన వాటిపైకి దృష్టిని మరల్చకూడదు మనసు చంచలమైనది దేనిని చూస్తే దాని పై మనసు పడుతుంటే దానికోసం తప్పించకూడదు నీవు చేయడాన్ని మర్చిపోకూడదు ఇది ప్రతి గురువు చెప్పే మాట దానిని ఆచరించవలసిన బాధ్యత భుజ స్కందల మీద ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోవద్దు.
పిల్లల పెంపకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి