హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ; - ప్రమోద్ ఆవంచ 7013272452

 ప్రతి సంవత్సరం బుక్ ఫేర్ గురించి ఎదురు చూస్తుంటాను.ఈసారి డిసెంబర్ లో జరిగేది ఫిబ్రవరికి
పోస్ట్ పోన్ అయ్యింది.కొంచెం అసంతృప్తి.నా కన్నా నా
బిడ్డకు ఎక్కువ ఆసక్తి.బుక్ ఫేర్ ఎప్పుడు నాన్న అని....
ఎట్టకేలకు ఫిబ్రవరి తొమ్మిది నుంచి పందొమ్మిది వరకు అనీ, అనౌన్స్ చేశారు.హమ్మయ్య...అనుకున్నాను.బిడ్డకు
చెప్పేసాను.రెడీగా ఉండమనీ.నా బిడ్డకు కూడా మా నాన్నకు లాగే సాహిత్యాసక్తి ఎక్కువ.అప్పుడప్పుడు కవితలు రాస్తుంటుది.నాకు సంతోషం ఏమిటంటే నా బిడ్డ కూడా తాతయ్య అడుగుజాడల్లో నడుస్తుంది అని.చాలు ఏ తండ్రికైనా ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.ఫాదర్స్ 
డే సందర్భంగా బిడ్డ రాసిన రైటప్ నా చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది....తనలో నిగూఢంగా ఒక భావుకత,
రాయాలన్న తపన ఉందన్న విషయం అర్ధం అయ్యింది.
ఇక అప్పటి నుంచి బిడ్డను ఎంకరేజ్ చేస్తున్న.బాగా చదవమనీ,రోజులో ఏదో ఒకటి రాయమని.ఇది నాకు చెప్పిన గురువు గారు వేదాంత సూరి గారు,ఇదే విషయం మా నాన్న గారు కూడా చిన్నప్పటి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి  నాకు చెపుతూనే ఉన్నారు.చివరిగా సూరి గారు చెప్పాక బుర్రకెక్కింది.నేను అమలు చేసాను.కానీ ఇంకా నా జర్నీ ప్రారంభంలోనే ఉంది, ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది.చాలామంది
కవులు, రచయితలు చాలా గొప్పగా రాస్తున్నారు.అవి
చదివాకా నేను ఇంకా ఓనమాలు దిద్దే విద్యార్థి దశలోనే
మిగిలిపోయాననిపిస్తుంది.ప్రయత్నం చేస్తాను....మా బాస్ డాక్టర్ చంద్రమోహన్ గారు ప్రీతి యూరాలజి అండ్ కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్,ఆంధ్ర , తెలంగాణలో ప్రముఖ యూరాలోజిస్ట్.ఆయన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీజిఐ- చండీగఢ్ లో చదువుకున్నారు.
అక్కడ చాలా మంది చదువుకున్నా అందరూ పెద్ద స్థాయిలో ఫేమస్ కాలేదు.కానీ ఈయన చాలా రిస్క్ యూరో ఆపరేషన్లను కసితో, చాలా పాషినేట్ గా చేసి సక్సెస్ అయ్యారు...పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి
తొమ్మిది గంటల వరకు విశ్రాంతి లేకుండా కష్టపడుతూనే ఉంటారు.ఎవరితోనైనా మాట్లాడినా, తోటి కొలిగ్స్ తో డిస్కస్ చేసినా, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఎవరైనా యూరాలజిస్ట్ ఒక కాంప్లికేటెడ్ సర్జరీ చేసారంటే
ఆ డాక్టర్ తనకన్నా వయసులో పెద్దవాడైనా, చిన్న వాడైనా ఎలాంటి బేషిజమ్ లేకుండా అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా తాను ఫేస్బుక్ వేదికగా నిర్వహించే ప్యూర్ యూరాలజి జూమ్ ద్వారా పరిచయం చేస్తారు.
దీని ద్వారా యంగ్ యూరాలజిస్ట్ లకు నేర్చుకోవడానికి 
ఎంతో ఉపయోగపడుతుంది, తద్వారా తాను నేర్చుకుంటారు.డాక్టర్ చంద్రమోహన్ గారు నిత్య విద్యార్థి.
ఆయనకు అదే ప్రపంచం.... ఇదంతా ఎందుకు చెప్పాల్సి
వచ్చిందంటే నేర్చుకోవాలని తపన ఉన్నవాళ్ళు రోజూ నిత్య విద్యార్థులే.అలాగే చదవడం, రాయడం అనేది నిత్యం చేయాల్సిందే....కట్ చేస్తే....
               గులాబీల మల్లారెడ్డి గారు కవి, రచయిత, జర్నలిస్టు, న్యాయవాది.ఆయన నాకు గురువు గారు వేదాంత సూరి గారికి సిద్దిపేటలో జరిగిన సన్మాన సభలో
పరిచయమయ్యారు.ఆ రోజు నాకు తాను రాసిన కోర్టు రణభూమిలో వెయ్యి యుద్ధాలు, వేయి విజయాలు అన్న పుస్తకాన్ని ఇచ్చారు.ఆ పుస్తకాన్ని చదివాక నేను అర్థం చేసుకున్నంత మేరకు ఒక సమీక్ష రాసి నవ తెలంగాణ
పత్రికకు పంపించాను.వారు ప్రచురించారు.ఆ తరువాత
ఐదు తరాలు పుస్తకంపై రాసిన విశ్లేషణ కూడా ప్రచురించారు.ఇక అప్పటి నుంచి ఆయన నన్ను ఒక తమ్ముడిగా,నేను ఆయనను గురుభావంతో మెలుగుతూ
వస్తున్నాం.ఇటీవల పాలపిట్ట సాహిత్య మాస పత్రిక ఎడిటర్, పబ్లిషర్, గుడిపాటి గారు మల్లారెడ్డి గారి నలబై ఏళ్ళ సాహిత్య ప్రయాణంపై ఒక ప్రత్యేక సంచికను
ప్రచురించారు.ఆ సంచికలో ఆయన రాసిన కోర్టు రణభూమిలో వెయ్యి యుద్ధాలు, వేయి విజయాలు అనే పుస్తకంపై ఒక ఆర్టికల్ రాసాను....కట్ చేస్తే...
                      ఇవాళ శనివారం గద్దర్ ప్రాంగణంలో జరుగుతున్న బుక్ ఫేర్ వేదికగా ఆ ప్రత్యేక సంచికను, ఇంతే కాకుండా ఆయన రాసిన ఇతర పుస్తకాలు ప్రేమ పావురాలు - మానవతా సౌరభాలు, ఎద్దు ఎవుసం,సురుకుల వైద్యం,ఐదు తరాలు ఆవిష్కరణలు కూడా జరిగాయి.ఈ కార్యక్రమానికి నేను సమన్వయ కర్త గా వ్యవహరించాను.చాలా సంతోషం కలిగింది.ఈ అవకాశం కల్పించిన గులాబీల మల్లారెడ్డి గారికి, పాలపిట్ట సాహిత్య మాస పత్రిక ఎడిటర్, పబ్లిషర్ గుడిపాటి గారికి
నమస్సులు....ఈ కార్యక్రమంలో  ఆయనను గురించి నేను రాసిన పరిచయ వాక్యాలు... ఒక్కసారి మీ కోసం....
"గిరిజన,దళిత,బహుజనుల కోసం వంద సంవత్సరాల క్రితమే పోరాడిన మొదటి బోల్షెవిక్ మల్ దాదా వారసుడిగా, దాదాపు నాలుగు దశాబ్దాలగా, సాహిత్య,సమాజ సేవ చేస్తున్నారు, జర్నలిస్టు,కవి, రచయిత, న్యాయవాది, శ్రీ గులాబీల మల్లారెడ్డి.1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో  చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆయనను కరీంనగర్ జైలులో నిర్బంధించారు. యాభై ఏళ్ల సుదీర్ఘ సాహితీ ప్రస్థానం లోఆయన 10 పుస్తకాలు వెలువరించారు.ఇంకా అయిదు పుస్తకాలు అముద్రితాలు.ఆయన 1984 సంవత్సరంలో రాసిన పల్లె పొలిమేరల్లోకి అన్న కవితా సంపుటిలోని 
ఎబౌట్ మై బెటర్ హాఫ్ కవితలో తన సహచరి ఎలా ఉండాలో అద్భుతంగా అక్షరీకరించారు.ఆయన రాసిన
మల్ దాదా చారిత్రాత్మక నవల చరిత్ర సృష్టించింది.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసిన మల్ దాదా స్వయాన ఆయన తాతగారు.తాత పేరుతో పాటు
తనలోని పోరాల లక్షణాలను పునికి పుచ్చుకుని న్యాయవాదిగా,పేద ప్రజల పక్షాన నిలిచి కోర్టు రణభూమిలో వెయ్యి యుద్ధాలు,వేయి విజయాలు సాధించారు.ఈ పుస్తకం యువ న్యాయవాదులకు కరదీపిక లాంటిది.ఆయన రాసిన ఐదు తరాలు పుస్తకంలో ఐదు తరాల తన వంశ చరిత్రను డాక్యుమెంట్
చేసారు.ఈ పుస్తకం ఎలెక్స్ రాసిన ది రూట్స్ నవలలా
ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.
               గ్రామ సర్పంచ్ గా అన్ని వర్గాలకు దగ్గరై, వాళ్ళ
సహకారంతో, గ్రామాన్ని అభివృద్ధి చేసారు.ఆయన న్యాయవాదిగా కొనసాగుతూనే పత్రికా ఎడిటర్ గా, లీగల్ కరస్పాండెంట్ గా, జర్నలిస్టుగా, ఎన్నో వార్తాకథనాలు రాసి ఇటు అధికారుల్లో ను,అటు ప్రభుత్వంలోను,చలనం
తీసుకువచ్చారు.చివరికి కోర్టులకు సైతం చురకలు వేస్తూ,
సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.
                   ఇటీవల "పోరాట వారసత్వం- గులాబీల మల్లారెడ్డి సారస్వతం " అన్న శీర్షికతో పాలపిట్ట సాహిత్య మాస పత్రిక ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది."
                          మొత్తం మీద ఈ సాయంత్రం చాలా అద్భుతంగా గడిచింది.బుక్ ఫేర్ లో అనేక మంది గొప్ప కవులను, రచయితలను,కలిసే అవకాశం కలిగింది..
                         

కామెంట్‌లు