మారిన శివయ్య; - ఎమ్. సాయికిరణ్ -8/A తరగతి,- TTWURJC (B) కొండాపూర్ నారాయణపేట
 అనగనగ రామాపురం అనే ఊరు. ఆ ఊరిలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒకరి కింద జీతగాడిగా పని చేసేవాడు.
శివయ్యకు ఒక ఆవు మరియు ఆ ఆవు లేగదూడ ఉంటుంది. శివయ్య ఆ ఆవును ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. ఇంకా ఆ ఆవుకు సరపడాగడ్డి కూడా వెయ్యడు. ఆవు గడ్డి తినక పోవడంతో ఎక్కువ పాలు ఇచ్చేది కాదు. ఇంకా ఆ ఆవు ఇచ్చే పాలు శివయ్య మొత్తం తీసుకునేవాడు, వచ్చిన పాలను అమ్మి బతికేవాడు. ఆ దూడకు పాలు ఉంచేవాడు కాదు. అలా ఆ ఆవుకు గడ్డి వెయ్యడు, దూడకు పాలు ఉంచడు. శివయ్య .ఇంకా ఆవు పాలు ఇవ్వడం లేదని ఆవును రోజు కొట్టేవాడు శివయ్య . అయినా తనను ఎంత కొట్టిన ఆవు శివయ్య పట్ల ప్రేమగా ఉండేది.ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ ఆవుపడుతున్న కష్టాన్ని చూసి ఒక దేవత ఆవు ముందు ప్రత్యక్షం అయింది. ఇంకా ఇలాఅంటుంది నీకు ఇన్ని బాధలు కలిగిస్తున్న శివయ్యకు ఏమైన కీడు కలిగించాలా అని అడుగుతుంది. దేవత. దానికి ఆవు ఏమి వద్దు కేవలం రేపు ఒక్క రోజు శివయ్యకు అన్నం దొరకకుండా చూడు ఇంకా నేను మాట్లాడేటట్టు చూడు అని ప్రార్థిస్తుంది దానికి దేవత సరే తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు శివయ్యకు కూడా తినడానికి, తాగడానికి ఏమి దొరుకదు. తను అన్నం తినకుండ ఉండడం వల్ల ఎక్కువగా నీరసంగా ఉంటాడు. ఆ ఇంటి యజమాని శివయ్య బాధలను పట్టించుకోకుండా పని చెయ్యమని బలవంతం పెడుతాడు. శివయ్య రోజంత పని చేసి సాయంత్రం అయ్యాక ఇంటికి వచ్చి ఆవు ముందు కూర్చుంటాడు అప్పుడు అవు ఇలా అంటుంది నువ్వు ఒక్కరోజు అన్నం తినకపోతేనే ఇలా ఐపోయావు. నాకు, దూడకు సరపడా గడ్డి ఏ రోజైన పెట్టావా. నేను గడ్డి తినకుండా పాలు తక్కువ ఇస్తే నన్ను రోజు కొడుతావు. నీకు ఇంతనైన జాలి, దయ ఉందా. ఏరోజైన మా గురించి పట్టించుకున్నావ. నువ్వు ఒక్క రోజు తినకపోతేనే ఇలా అల్లాడుతున్నావు అనిఅడిగింది. తన తప్పు తెలుసుకున్న శివయ్య ఎంతో పశ్చాతాపపడ్డాడు. తనను క్షమించమని ఆవుని కోరాడు. ఆ రోజు నుండి ఆవును మంచిగా చూడసాగాడు.


కామెంట్‌లు