సహాయం - # బి. నిఖిల్ చరణ్ 9వ తరగతి-ZPHS ఇబ్రహీం నగర్ మండలం చిన్నకోడూరు జిల్లా సిద్దిపేట. సెల్: 6300203158
 అనగనగా ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను బిక్షం అడుక్కునేవాడు. దారిన పోయిన వాళ్లంతా అతని చూస్తారే గాని ఒక్కరు కూడా బిక్షం వెయ్యరు. అలా ఆ రోజంతా అక్కడే కూర్చుంటాడు. రోజులు గడుస్తాయి కానీ అతనికి బిక్షం ఒకటి లేదా రెండు రూపాయలు వస్తాయి. ఒకరోజు ఒకాయన భిక్షం వేస్తుండగా ఒక ఆలోచన వస్తుంది. నేను నీకు ఒక సహాయం చేస్తాను నీవు ఎవరు మీద ఆధారపడి జీవించవు.  బరువు తనిఖీ యంత్రం కొని ఆ బిచ్చగాడికి ఇస్తాడు.  అక్కడికి అందరూ వచ్చి పోయే వాళ్ళ బరువు తెలుసుకొని కొన్ని డబ్బులు వేస్తారు. అలా కొన్ని రోజులా తర్వాత ఆ బిక్షగాడు కాఫీ షాప్ పెట్టుకుంటాడు. ఒకరోజు అక్కడికి బరువు తనిఖీ కొని ఇచ్చినా తను వస్తాడు. బరువు తనిఖీ కొనిచ్చిన అతను డబ్బులు ఇస్తుంటే వద్దు అంటాడు. అప్పుడు బిచ్చగాడు అంటాడు. మీరు కనుక నాకు "బరువు తనిఖీ" కొన్ని ఇవ్వకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు ధన్యవాదాలు అని చెప్పుతాడు .బరువు తనిఖీ యంత్రం కొనిచ్చినందుకే అతను అంటాడు. నువ్వు కూడా ఇలా డబ్బులు ఇవ్వకుండా వాళ్లకు ఏదైనా అవసరమైన వస్తువు కొని ఇవ్వు. 
సరే సార్ మీరు చెప్పినట్టే నేను కూడా ఇలా ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా వాళ్లకు ఉపయోగమైన వస్తువులు కొని ఇస్తాను. వారు బాగుపడే సహాయం చేస్తాను సార్.

కామెంట్‌లు