: జీవిత పరమార్థం -గాడే పల్లి మల్లికార్జునుడు- హైదరాబాద్-సెల్ : 9000749651

 కుసుమ ధర్మన్న కళా పీఠం
=================[
ఈ మాయా మేయమైన,
ఎంతో అద్భుతమైన జీవితం మనకు 
 ఆ దైవమిచ్చిన అరుదైన
బహుమానం  ఓ నేస్తం/
ఈ కాయం భువిపై 
ఉన్నంత కాలం  మన 
జీవితానికి బంధాల
సంకెళ్లు తప్పవనేది
కఠోర సత్యం/
అయితే మనం ఉన్నంతకాలం
అర్థం లేని ఆర్భాటాలకు ,
ఆరాటాలకు,
వ్యామోహాలకు
సాధ్యమైనంత వరకు
 దూరమైతేనే చింతలిక
 బహు దూరం/
మన మనసంతా 
ప్రశాంత మైన మరో
శాంతి నికేతనం/
ధర్మ బద్ధమైన జీవితానికి 
చక్కని అవకాశం/
పంచ భూతాల సాక్షిగ 
పరోపకార పరాయణత్వానికి
మనం మార్గ దర్శకులం/ మహనీయుల 
ఆశయాలకు మనమే 
మేటి వారసులం/
అందుకే కష్ట సుఖాలు 
విచిత్రంగ కల బోసిన
ఈ జీవిత చదరంగాన మనోనిగ్రహంతో,
ఆత్మ విశ్వాసంతో ప్రతి
అనుభూతిని  సమంగ
స్వీకరించడమే ఎంతటి
వారికైనా తప్పని
 ధర్మం ఓ నేస్తం/
 వట్టి మాటలు కట్టి పెట్టి,
 గట్టి మేలు తలపెట్టుచు
మన జీవితానికి నిండు
దనం చేకూర్చుదాం/
జీవితమంటేనే ఒకరికి 
ఇవ్వడం అనే సూక్తికి 
మనం ఆదర్శమవుదాం/
పరమత సహనం,
నిర్మల సౌజన్య మూర్తి మత్త్వం లక్ష్యాలై  జీవించుదాం నిరంతరం/
నాడే నీటి బుడగ యైనా మన జీవితం ఎంతో ధన్యం/
భావి తరానికి మనం స్ఫూర్తి దాయకం/
***********
 హామీ పత్రము
నమస్కారం,
 ఆర్యా,
  నేటి * జీవితం *
అనే కవితాంశమునకు 
సంబంధించి నా కవిత
* జీవిత పరమార్థం* 
నా స్వీయ రచన.
ఏ అనువాదం,
అనుసరణ కాదు.
ఏ పత్రికకు పంపలేదు.
కామెంట్‌లు