పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్ పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 పాల్కురికి సోమనాథుడు రచించిన
పంచపది బసవ పురాణము
========================
111
నీ పేరు స్మరిస్తేనే చాలు ముక్తులవుతారు
పశుపక్ష్యాదులైనా పరమ భక్తులవుతారు
శత్రువులయినా మంచి మిత్రులవుతారు
శివనామంముతో మోక్షము పొందుతారు
అల్లమ ప్రభువు బసవని భక్తి మెచ్చె విఠల!
112
నీవే సాక్షాత్తు శ్రీ జంగమ దేవుడవు
నీవేగా శివుడివు సంగమేశ్వరుడవు
కైలాస వాసుడవు ప్రమథగణుడవు  
అల్లమ ప్రభువా!నీవే విశ్వేశ్వరుడవు!
అని బసవేశ్వరుడు పలికినాడు విఠల!
113
ప్రమథులు భిన్నరూపాలు ధరించారు
గోవులు మేషాల వేషాలలో వున్నారు
వివిధ వానరుల రూపాలతో నున్నారు
కుక్కుటాది ముఖాలను కలిగి వున్నారు
పార్వతి వీరిని విందుకాహ్వానించెను విఠల!
114
పార్వతి ఆకాశం వంటగదిగా చేసుకొని
అఖిల బ్రహ్మాండం పాత్రలుగా చేసుకొని
సముద్రాలనే పాలుపెరుగులు చేసుకొని
చెరుకుతో రసాలను సిద్ధము చేసుకొని
ఆమె పక్వాన్నాలను తయారు చేసెను విఠల!
115
ప్రమథులు చిన్నవాణ్ణి పంపించినారు
వంట గురించి తెకుసుకోమని అన్నారు
సిద్ధమయ్యిందని చెప్పెను, అమ్మ వారు
బాలునికి అన్నము పెట్టెను అమ్మ వారు
అందరి అన్నమునారగించెనతడు విఠల!
116
పార్వతీ దేవి అమితాశ్చర్యపోయింది
బాల ప్రమథుని గురించి వివరించింది
మహిమలను వివరించమని కోరింది
ప్రమథుల గొప్పతనము వినసాగింది
వారిని వేదాలు స్తుతించిరనె శివుడు విఠల!
117
ప్రమథులంటే ఏమనికున్నావని అనెను
వారసంఖ్యతాస్సహస్రాణి అని అనెను
ఏవమేతన్నిబోధితా అని వివరించెను
వీరంతా మహా గణములేనని చెప్పెను
వారి మహాత్మ్యం చెప్పె శివుడు విఠల!
118 
ప్రమథులే మాకు శరీరమని చెప్పెను
బ్రహ్మ విష్ణువులారాధిస్తారని చెప్పెను
సమస్త దేవతలు పూజిస్తారని అనెను
దేవతలైన పరాజితులౌతారని చెప్పెను
వారి గొప్పనేమని చెప్పగలననె శివుడు విఠల!
119
అల్లమ ప్రభూ!నీవు శివుడవేననె బసవడు
సమస్త ఆహారం అరగించగలవని అన్నాడు
అందులో ఆశ్చర్యమేమి వుందని చెప్పాడు
అదివిని అల్లమ ప్రభు చాల సంతసించాడు
బసవేశ్వరునికి ఎన్నో వరాలనిచ్చెను విఠల!
120
తలచిన పదార్థాలు ప్రత్యక్షమయ్యేటట్లు
బసవడు ఆడిన మాట తప్పక జరిగేటట్లు
పరీక్షలో పరమేశ్వరుడినైననూ గెలిచేటట్లు
శివతత్త్వము విశ్వంలో విస్తరింపచేసేటట్లు
వరాలు పొంది శివభక్తి ప్రచారం చేసె విఠల!



కామెంట్‌లు