121
ఒకనాడు దొంగలు అంతఃపురానికొచ్చారు
ధనము దొంగలించాలని ప్రయత్నించారు
లింగములేనిదే ప్రవేశం లేదని గ్రహించారు
వంకాయలు కట్టుకొని లోనికి ప్రవేశించారు
బసవడు వారికి శివపూజచెయ్యండనె విఠల!
122
తప్పు చేసిన దొంగలందరూ భయపడ్డారు
బసవన్న నవ్వుచూసి నిజాన్నొప్పుకున్నారు
తమ వంకాయలను చేతిలలో పట్టుకున్నారు
దొంగలందరూ శివార్చనను ప్రారంభించినారు
వంకాయలు లింగాలుగా మారి పోయెను విఠల!
123
బల్లేశు మల్లయ్య, ధాన్యపు వ్యాపారస్తుడు
ధాన్యంకొలిచే కుంచం లింగంగ భావించాడు
దానినే లింగంగా పూజించి ముక్తిని పొందాడు
బసవేశ్వరుడది చూచి చిరునవ్వు నవ్వినాడు
అక్కడే శివాలయం ప్రత్యక్ష మయ్యెను విఠల!
124
కాటకోటడనే గొల్ల భక్తుడు వుండేవాడు
మేక పెంటికను లింగంగా పూజించాడు
దాన్ని మేకపాలతో అభిషేకము చేశాడు
తండ్రి వ్యతిరేకిస్తే అతడు తలనరికాడు
కైలాసమే ఊగి తలుపులు కిందపడె విఠల!
125
బావూరి బ్రహ్మయ్య,జొన్నలను కొలిచాడు
లింగ రూపంగా భావించి పూజలు చేశాడు
శివభక్తులకసాధ్యములేదని నిరూపించాడు
అతడు పరమశివుని అనుగ్రహం పొందాడు
శైవ భక్తులకసాధ్యమైనదేదియూ లేదు విఠల!
126
సిద్ధరామ యోగికి ఎందరో భక్తులున్నారు
వారు తమ గురువుగారిని కలిసి అడిగారు
బసవడిని గురించి ఆయనను ప్రశ్నించారు
కైలాసం భూలోకంలో ఎలావుంటుందన్నారు
అది విని సిద్ధరామయ్య కైలాసం వెళ్లె విఠల!
127
యోగ మార్గంలో కైలాసవాసుణ్ణి కలిశాడు
భక్తుల సందేహాన్ని పరమేశునితో అడిగాడు
బసవడు,కైలాస-భూలోక వాసుడని అన్నాడు
అతడు ప్రమథ గణాలలో భక్తులలో వుంటాడు
నా మాదిలోనూ వుంటాడనె పరమశివుడు విఠల!
128
శివుడు హృదయము విప్పి బసవుణ్ణి చూపాడు
బసవేశ్వరుడు పద్మాసనంలో కొలువై వున్నాడు
అడంతా చూసి సిద్ధిరామయ్య నివ్వెరబోయాడు
పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారము చేశాడు
దేవతలు ప్రమథులందరూ నమస్కరించిరి విఠల!
129
శివుడు పార్వతీదేవితో చెప్పసాగాడు
నేనే బసవణ్ణని ఆమెకు వివరించాడు
శిలాదునికి పుత్రుడిగా పుట్టానన్నాడు
భక్తహితార్థం బసవనిగావున్నానన్నాడు
బసవన్న లోకపావనుడనె శివుడు విఠల!
130
నేను భక్తవత్సలుడనని చెప్పాడు
బసవడు లోకోపకారి అని అన్నాడు
బసవన్న భక్త రత్నమేనని చెప్పాడు
అతడు భక్తికి రారాజు అని అన్నాడు
ద్వితీయ శంభుడని శివుడనెను విఠల!
ఒకనాడు దొంగలు అంతఃపురానికొచ్చారు
ధనము దొంగలించాలని ప్రయత్నించారు
లింగములేనిదే ప్రవేశం లేదని గ్రహించారు
వంకాయలు కట్టుకొని లోనికి ప్రవేశించారు
బసవడు వారికి శివపూజచెయ్యండనె విఠల!
122
తప్పు చేసిన దొంగలందరూ భయపడ్డారు
బసవన్న నవ్వుచూసి నిజాన్నొప్పుకున్నారు
తమ వంకాయలను చేతిలలో పట్టుకున్నారు
దొంగలందరూ శివార్చనను ప్రారంభించినారు
వంకాయలు లింగాలుగా మారి పోయెను విఠల!
123
బల్లేశు మల్లయ్య, ధాన్యపు వ్యాపారస్తుడు
ధాన్యంకొలిచే కుంచం లింగంగ భావించాడు
దానినే లింగంగా పూజించి ముక్తిని పొందాడు
బసవేశ్వరుడది చూచి చిరునవ్వు నవ్వినాడు
అక్కడే శివాలయం ప్రత్యక్ష మయ్యెను విఠల!
124
కాటకోటడనే గొల్ల భక్తుడు వుండేవాడు
మేక పెంటికను లింగంగా పూజించాడు
దాన్ని మేకపాలతో అభిషేకము చేశాడు
తండ్రి వ్యతిరేకిస్తే అతడు తలనరికాడు
కైలాసమే ఊగి తలుపులు కిందపడె విఠల!
125
బావూరి బ్రహ్మయ్య,జొన్నలను కొలిచాడు
లింగ రూపంగా భావించి పూజలు చేశాడు
శివభక్తులకసాధ్యములేదని నిరూపించాడు
అతడు పరమశివుని అనుగ్రహం పొందాడు
శైవ భక్తులకసాధ్యమైనదేదియూ లేదు విఠల!
126
సిద్ధరామ యోగికి ఎందరో భక్తులున్నారు
వారు తమ గురువుగారిని కలిసి అడిగారు
బసవడిని గురించి ఆయనను ప్రశ్నించారు
కైలాసం భూలోకంలో ఎలావుంటుందన్నారు
అది విని సిద్ధరామయ్య కైలాసం వెళ్లె విఠల!
127
యోగ మార్గంలో కైలాసవాసుణ్ణి కలిశాడు
భక్తుల సందేహాన్ని పరమేశునితో అడిగాడు
బసవడు,కైలాస-భూలోక వాసుడని అన్నాడు
అతడు ప్రమథ గణాలలో భక్తులలో వుంటాడు
నా మాదిలోనూ వుంటాడనె పరమశివుడు విఠల!
128
శివుడు హృదయము విప్పి బసవుణ్ణి చూపాడు
బసవేశ్వరుడు పద్మాసనంలో కొలువై వున్నాడు
అడంతా చూసి సిద్ధిరామయ్య నివ్వెరబోయాడు
పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారము చేశాడు
దేవతలు ప్రమథులందరూ నమస్కరించిరి విఠల!
129
శివుడు పార్వతీదేవితో చెప్పసాగాడు
నేనే బసవణ్ణని ఆమెకు వివరించాడు
శిలాదునికి పుత్రుడిగా పుట్టానన్నాడు
భక్తహితార్థం బసవనిగావున్నానన్నాడు
బసవన్న లోకపావనుడనె శివుడు విఠల!
130
నేను భక్తవత్సలుడనని చెప్పాడు
బసవడు లోకోపకారి అని అన్నాడు
బసవన్న భక్త రత్నమేనని చెప్పాడు
అతడు భక్తికి రారాజు అని అన్నాడు
ద్వితీయ శంభుడని శివుడనెను విఠల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి