పంచపది బసవ పురాణము;- కాటేగారు పాండురంగ విఠల్ పంచపది రూపకర్త-హైదరాబాద్ 9440530763
 151
బిజ్జలునికి ఓ శివభక్తుని కథ చెప్పసాగాడు
తమిళదేశంలో వుండె"ఇరువదాండాది"భక్తుడు
శివభక్తులను ఎగతాళి చేస్తే సంహరించేవాడు
ఒకనాడు ఏనుగు భక్తుణ్ణి చంపడం చూశాడు
అతడు మావటిని ఏనుగును చంపెను విఠల!
152
ఇరువదాండాది కరి పాలకుణ్ణి చంపుతానన్నాడు
రాజు చోళభూపతి ఈవిషయం తెలుసుకున్నాడు
అతడు భయముతో గజగజా వణికి పోయినాడు
శివుడు ప్రత్యక్షమై కరి-మావటిని బతికించాడు
మహారాజు ఇరువదాండాది భక్తిని మెచ్చె విఠల!
153
బావూరి బ్రహ్మయ్య అను శివశరణుడుండేవాడు
భక్తులకు రోజూ పూల మాలలు కట్టి ఇచ్చేవాడు
లభించిన దానితోనే జంగమార్చనలు చేసేవాడు
నిత్యం శివార్చనచేస్తూ జీవనము సాగించేవాడు
ఒక ఏనుగొచ్చి మాలలను ధ్వంసంచేసెను విఠల!
154
బ్రహ్మయ్య ఏనుగును హతమార్చినాడు
రాజు ఈ విషయము తెలుసుకున్నాడు
తప్పు జరిగినదని చాలా దుఃఖించాడు
బ్రహ్మయ్య పాదాలకు శరణువేడినాడు
బ్రహ్మయ్య  ఆ ఏనుగును బతికించెను విఠల!
155
బిజ్జలా!మాచయ్యను నిందించకన్నాడు
శివశరణులను చులకన చేయకన్నాడు
ఆ మహాత్ముడిని శరణు వేడమన్నాడు
జంగములను సదాగౌరవించుమన్నాడు
బసవేశ్వరుడి మాటవినె బిజ్జలుడు విఠల!
156
జీవహింస కూడదని బసవడు ఒట్టుపెట్టాడు
శరణన్న జీవి సంరక్షణ భక్తుల ధర్మమన్నాడు
విటుడనువాడు బ్రహ్మయ్యపై కత్తిని ఎత్తినాడు
బ్రహ్మయ్య విటుణ్ణి రెండు ముక్కలుగా నరికాడు
బ్రహ్మయ్యపై బిజ్జలునికి చాల కోపం వచ్చె విఠల!
157
ఒక గొర్రెకోసం మనిషిని చంపుతావా?అన్నాడు
శివభక్తులు దయాపరులు కదా?అని అన్నాడు
మూగజీవి కోసం మనిషిని చంపెదవా?అన్నాడు
భువిపై మనుషులను బతుకనియ్యరా?అన్నాడు
బ్రహ్మయ్య చేసిన పనికి రాజు మందలించె విఠల!
158
మూగ ప్రాణితో నీకు అవసరమేమని అన్నాడు
బిజ్జలుని మాటలు విని బసవేశ్వరుడు నవ్వాడు
ఎందుకు నవ్వుతున్నావని బిజ్జలుడు చెప్పాడు
మీ శివభక్తుల ధర్మాలు నాకు తెలుసులే అన్నాడు
మీరు చేసేది చూస్తూవుండలేననె బిజ్జలుడు విఠల!
159
శివ శరణులందరూ అన్నిటినీ కాలదన్నడం
అదేవిధంగా కోపంతో మాంస ఖండాలు పెట్టడం
పుత్రుల్ని చంపడం మనుషుల్ని రాళ్లతో కొట్టడం
భార్యను పరులకివ్వడం తండ్రులను చంపడం
గొర్రెకై మనిషిని చంపడమేనా భక్తి?అనె రాజు విఠల!
160
ఇక రాజ్యమేలడం నావల్ల కాదనె బిజ్జలుడు
ప్రభూ!మీరు తొందరపడవద్దనె బసవేశ్వరుడు
శివభక్తులు ధర్మంతప్పి ఎన్నడూ చరించరన్నాడు
కిన్నెర బ్రహ్మయ్య సామాన్యుడు కాదని అన్నాడు
అతడు సాక్షాత్తు శివుడే!అనె బసవన్న విఠల!


కామెంట్‌లు