పంచపది బసవ పురాణము;- కాటేగారు పాండురంగ విఠల్ పంచపది రూపకర్త-హైదరాబాద్ 9440530763


 161
రాజా!తొందర పడవద్దని చెప్పె బసవేశ్వరుడు
ఎవరో చెప్పిన మాటలను వినవద్దని అన్నాడు
ఈ న్యాయ మూర్తులను పంపించని చెప్పాడు
జరిగినదేమిటో పూర్తిగా విచారించని అన్నాడు
పిదప నిర్ణయం తీసుకొమ్మనె బసవడు విఠల!
162
వారితో కలిసి బసవన్న బ్రహ్మయ్యను చేరాడు
పాదాభివందనం చేసి అతనిని ప్రస్తుతించాడు
కిన్నర బ్రహ్మయ్య గుడి తలుపువైపు చూశాడు
త్రిపురాంతకా అని గొంతెత్తి బిగ్గరగా పిలిచాడు
లింగం నుండి శివుని మాట ప్రతిధ్వనించె విఠల!
163
శివుని మాటవిని ప్రజలందరు వణికిపోయారు
లింగస్థులు కానివారందరూ మూర్ఛ పోయారు
కిన్నర బ్రహ్మయ్యకు సాష్టాంగ ప్రణామం చేశారు
నీవు మనిషి కాదు!శివస్వరూపమని స్తుతించారు
నీవు జగదాధారుడవని అందరు మ్రొక్కిరి విఠల!
164
బిజ్జలునితో సహా అందరూ మేల్కొనినారు
బ్రహ్మయ్యా! మేమందరమజ్ఞానులమన్నారు
మమ్ముల మన్నించి కరుణించమని వేడినారు
రాజుతోపాటు అందరు గుడి నుండి వెళ్లినారు
రాజా!భక్తులనాదరించమనె బసవన్న విఠల!
165
శివ భక్తులకు అండాదండగా యుండుము
రాజా!నీ రాజ్యానికుండదు ఏ కష్ట నష్టము
శివ శరణులను ఎల్లప్పుడు ఆదరించుము
ప్రజలందరికీ కలుగును శుభము సౌఖ్యము
బ్రహ్మయ్య రాజు బిజ్జలునితో చెప్పెను విఠల!
166
కళ్యాణ నగరంలో శివభక్తుడుండేవాడు
ఇంద్రజాలికుని వేషమునుధరించేవాడు
కొమ్ము కోలపట్టి భక్తుల ఇంళ్లకెళ్ళేవాడు
జంగమ కోటిని సేవించి అలరించేవాడు
ఇతని దర్శనానికి ఓ జంగముడొచ్చె విఠల!
167
అలసిపోయి జంగముడు కూలబడిపోయాడు
పిదప అక్కడ కలకోత బ్రహ్మయ్య కనబడ్డాడు
ఇదంతాచూచి జంగమయ్యకు సేవలు చేశాడు
పిదప అతడు నేను దరిద్రుణ్ణని వివరించాడు
కిన్నెర బ్రహ్మయ్య దీవెనlకై వచ్చాననెను విఠల!
168
జంగముడు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు
అతనిని రాళ్ళగుట్ట దగ్గరికి తీసుకెళ్ళినాడు
అతడు కోలతో రాతిగుట్టను తాకించైనాడు
రాళ్లన్నీ నిధిగా మారడం కళ్లారా చూసినాడు
జంగమయ్య ఆశ్చర్యచకితుడయ్యాడు విఠల!
169
జంగమయ్య ఆనందాశ్రువులను జాలువార్చాడు
బ్రహ్మయ్యకు శరణుజేసి వేవేల నమస్కరించాడు
పరుగెత్తుకుంటూ నగరము లోపలికి పరుగెత్తాడు
బ్రహ్మయ్య ఇచ్చిన ధనమును మోయలేనన్నాడు
సాయం చేయమని బసవన్నను కోరినాడు విఠల!
170
కలకౌత బ్రహ్మయ్య మాయలకాశ్చర్యపోయాడు
ఇది శివ భక్తులకే సాధ్యమని బసవ డన్నాడు
చింతామణికైనా ఇది సాధ్యం కాదని చెప్పాడు
కల్పవృక్ష కామధేనువులకైన అసాధ్యమన్నాడు
బసవడు కలకోత బ్రహ్మయ్యకు శరణనె విఠల!
.

కామెంట్‌లు