పంచపది బసవ పురాణం- -కాటేగారు పాండురంగ విఠల్ పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 91
హింగులేశ్వరం బ్రాహ్మణ అగ్రహారము
ఇచట ఆచరిస్తారు పాశుపత శైవము
బాహ్యవాడి అనేది ఒక జన పదము
ఇచట కలదు నందీశ్వర మందిరము
బసవ ఐక్యస్థలము సంగమేశ్వరం విఠల!
92
కూడలి సంగమేశ్వరము త్రివేణీ సంగమము
దక్షిణ ప్రయాగగా ప్రసిద్ధి ఈ సంగమ క్షేత్రము
కృష్ణ మలప్రభ ఘటప్రభ నదుల సంగమము
ఇచటనున్నది నందీశ్వర వ్రత పుణ్య స్థలము
ఇచటనే మాదాంబిక వ్రతము చేసెను విఠల!
93
కళ్యాణ నగరపు బలదేవ దండనాయకుడు
అతడు కాలం చేసి కైలాసానికి వెళ్ళిపోయాడు
బిజ్జల రాజు అతని ఆప్తులను పిలిపించాడు
దండనాయకుడిగా అర్హుడున్నాడా?అన్నాడు
రాజుతో బంధువులు,వున్నాడని చెప్పిరి విఠల!
94
మహా శివభక్తుడు బసవేశ్వరుడున్నాడు
దండనాయకుడు బలదేవునికి అల్లుడు
అసామాన్యుడు ఎంతోవినయ సంపన్నుడు
పాప రహితుడు సర్వకళలందు ప్రవీణుడు
శివుడే ఆశీర్వదించాడనిరి బంధువులు విఠల!
95
బసవడే మనకు తగిన దండనాయకుడు
మహా బలవంతుడు సద్గుణ సంపన్నుడు
ఆప్తుల మాటలు విని రాజు సంతోషించాడు
అతనిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు
మంత్రులందరు సంగమేశ్వరం చేరిరి విఠల!
96
మంత్రులందరు సంగమేశ్వరము చేరారు
బసవన్నకు సాష్టాంగముగా ప్రాణమిల్లారు
నీకు స్వర్గ సుఖములే అక్కర లేదన్నారు
లోకహితార్థము మంత్రిగా వుండమన్నారు
బిజ్జలుని కోరికను మన్నించమనిరి విఠల!
97
మంత్రిపదవియే కాదు మండలత్వము
సమస్త రాజ్య భాండాగారాధిపత్యము
బిజ్జలుని సర్వరాజ్యనిర్వహణభారము
సకల సామ్రాజ్య పరిపాలనాధికారము
స్వీకరించని మంత్రులందరు కోరిరి విఠల!
98
రాజ్యము,ప్రజాలహితార్థమై బసవడు
కళ్యాణ కటకానికి పయనమయ్యాడు
బసవని రాక గురించి విన్న బిజ్జలుడు
నగరమునందంగా అలంకరింపజేశాడు
రాజు అందరితో కలిసి స్వాగతంపలికె విఠల!
99
బిజ్జలుడు బసవన్నను స్వీకరించాడు
తగిన రీతుల అతనిని గౌరవించినాడు
ఏనుగులు గుఱ్ఱములను అప్పగించాడు
పదాతిబలము భాండాగారములిచ్చాడు
బసవేశ్వరుణ్ణి అందరాహ్వానించిరి విఠల!
100
బసవనికి విభూతి వీడ్యములనిచ్చారు
ప్రజలు పుష్పాంజలులను సమర్పించారు
స్త్రీలందరు మంగళ హారతులనిచ్చారు
స్వస్తి వచనములతోటి ఆశీర్వదించారు
గీతాలతో,పద్యములతో స్తుతించారు విఠల!


కామెంట్‌లు