పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్-పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 41
శివపూజ చేస్తున్నట్లుగా ఆటలాడెను
శివభక్తులనే పరమశివునిగా తలచెను
సర్వజ్ఞుడై సర్వ విద్యలు నేర్చుకునెను
తండ్రి ఉపనయనము చేయదలిచెను
బాల బసవడు తండ్రిని వారించెను విఠల!
42
శివ భక్తుడవీవు జడుడెలా అయ్యావు
పరమాత్ముడినే గురువుగా కొలిచావు
దుర్నరుని గురువుగా ఎలా తలిచావు
పూర్వజన్మ కారణమా?పతన హేతువు!
బసవడు జన్మలేమిటి-ఈ కర్మలేమనె విఠల!
43
అగ్నిలో హవిస్సు వ్రేల్చడము దోషము
వేరే మంత్రాలను పలుకడము పాపము
తాటిమాలలకు మ్రొక్కుడము ఘోరము
కర్మ పాశమును మనము తెగ కోశాము
జంధ్యాలను కట్టడమేమనె బసవడు విఠల!
44
భష్మ రుద్రాక్షాలను ధరించే వాళ్ళము
క్షుద్ర ముద్రలను మేమెలా ధరిస్తాము?
నేను స్వీకరించా"మహేశ్వరాచారము"
కర్మ సముద్రంలో ముంచుట అధర్మము
నే నుభయ కర్మ నిర్మూలుడననె బసవడు విఠల!
45
పరమశివుడు బ్రహ్మ తలను నరికాడు
మరలా బ్రహ్మ వంశుడెలా అవుతాడు
ఈ గోత్ర క్రియలన్నీ వద్దని వారించాడు
శివుడు కుల రహితుడని వాదించాడు
బసవడు ఉపనయనం కూడదని చెప్పె విఠల!
46
ఉపనయనము శైవధర్మ సంబంధము
ఇందులో రుద్రుని-నందిని పూజించెదము 
ఇందులో గాయత్రి మంత్రము జపిస్తాము
అందులో అతి ముఖ్యం ప్రణవ మంత్రము
ఆగమంలో షోడశ సంస్కారాలున్నవి విఠల!
47
ఉపవీతం శివుడి సర్పానికి సంకేతము
పాత్ర శివుడుపట్టిన బ్రహ్మశరచిహ్నము
పాలశదండమే శూలానికి ప్రతిరూపము
వటువు ధరించిన చర్మమే గజ చర్మము
చందనమేగా భాషమానికి గురుతు విఠల!
48
ఉపనయనం వలన శివభక్తి తగ్గదనెను
శివభక్తుడు తిరస్కరించుట తగదనెను
పసివాడివి నీకేమియూ తెలియదనెను
మేంచెప్పినట్లుచేయడం నీ ధర్మమనెను
తండ్రి బసవనికి బుద్ధి మాటలు చెప్పె విఠల!
49
విపరీత మాటలు మాట్లాడకని చెప్పెను
పుత్రా!నీకీ దుర్బుద్ధులేమిటని చెప్పెను
కులదీపకునితో కులము వర్ధిల్లుననెను
కులనాశకునితో వంశం నశించుననెను
ఇలా మాట్లాడుటెప్పుడు వినలేదనెను విఠల!
50
నీవు వడుగు తిరస్కరించకని చెప్పెను
అలా అయితే నన్ను బహిష్కరిస్తారనెను
తండ్రి బసవనికి మాట వినమని చెప్పెను
లేదంటే శాశ్వతంగా వెళ్ళిపొమ్మని అనెను
తండ్రి తీవ్ర కోపంతో కొడుకును తిట్టె విఠల!


కామెంట్‌లు