పంచపది బసవ పురాణం; - కాటేగారు పాండురంగ విఠల్-పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 51
బసవన్న మిక్కిలి రోషంతో చెప్పసాగెను
బ్రాహ్మణత్వంకు భక్తికి సంబంధం లేదనెను
బ్రాహ్మణ దర్శనం-ధర్మం వేరు వేరని చెప్పెను
దైవము-మంత్రము వేరు వేరని చెప్ప సాగెను
శివత్వం వేరని తండ్రితో చెప్పె బసవడు విఠల!
52
ఆచార్యుడు వేరు బోధన వేరని అనెను
వేషధారణ కూడా వేరని తండ్రికి చెప్పెను
ధ్యానము నామము వేరు వేరని చెప్పెను
బాహ్యక్రియాలన్ని భిన్నమనిచెప్పసాగెను
శివ భక్తికి అన్నియు బేధం కలిగినవనె విఠల!
53
అత్యంత పవిత్రమైనది అగ్ని ముఖము
శివుని హస్తములోనున్న బ్రహ్మ శిరము
ప్రాణాది వాయువులు మరియు ప్రాణము
రుద్ర శిఖము మరియు విష్ణు గర్భము 
భూయోని కలిగుంటుందనె బసవడు విఠల!
54
గాయత్రిలోనుండు ఇరవై నాలుగక్షరాలు
ఉండు మంత్ర యుక్తమైనట్టి త్రి పాదాలు
పద పదము కూడా షట్కుక్షియుతాలు
ఉండును సాంఖ్యాయనసంయుక్త గోత్రాలు
ఈ మంత్రరాజంలో ఇవన్నీ వున్నవనె బసవడు విఠల!
55
బ్రహ్మజ్ఞ కర్మనేది శివమతమైనదే
శైవమనేది షడ్దర్శనాతీతమైనదే
మంత్రమనేది శృతివిహితమైనదే
ఇది వేదఅంతర్భాగం,పవిత్రమైనదే
షడక్షరియే మంత్రరాజమనె బసవడు విఠల!
56
శైవభక్తి,సహజ లింగైక్యత్వం నిష్ఠ కలిగినది
బ్రాహ్మణత్వం బహు దేవతాసేవతో కూడినది
భక్తి భావన పరమ పుణ్య కులసతి లాంటిది
ముని శాపగ్రస్త భూసురులకెలా భక్తి అబ్బుతుంది?
ఇలా బసవడు తన తండ్రిని ప్రశ్నించెను విఠల!
57
కర్మ భక్తి మార్గాలు వేరు వేరని అనెను
నన్ను కర్మలో నెట్టుతున్నారని చెప్పెను
నాకు మీరందరూ ధర్మేతరులని అనెను
తల్లితండ్రి బంధువులు కారని పలికెను
నాకు తోచినట్లుంటానని,బసవడు వెళ్లె విఠల!
58
శివసన్నిధియందు గుడిలోనే వుండసాగాడు
సహోదరియైన చిన్నాంబతో వుండసాగాడు
మాదాంబకు సహోదరుడు ఈ బలదేవుడు
మహారజైన బిజ్జలునికి దండ నాయకుడు
బసవడి భక్తికి పరమానందుడయ్యె విఠల!
59
నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు
బిడ్డను శైవేతురునికివ్వనని అన్నాడు
బసవడున్న దేవాలయం చెంతకెళ్ళాడు
నా కుమార్తెను పెళ్లాడమని కోరినాడు
బసవడు మేనమామ మాటనంగీకరించె విఠల!
60
బసవన్న సంగమేశ్వరము చేరినాడు
ఆ పుణ్యస్థలిలో పాదము మోపినాడు
గురుస్థవంతో వందనమాచరించినాడు
పరమశివుడిని మదిలో ధ్యానించినాడు
సంగమేశ్వరాన్ని తీర్థరాజంగా భావించె విఠల!


కామెంట్‌లు