పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్-పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763-


 71
సోమన సమకాలికుడు హరిహరుడు
బసవరాజ రగళె గ్రంథము రచించాడు
బసవణ్ణి కమ్మె కుల బ్రాహ్మణుడన్నాడు
ఇతన్ని లింగధారి బ్రాహ్మణుడనీ అన్నాడు
వీరిరువురు ఆంధ్ర తెలంగాణ వాసులు విఠల!
72
బసవన్న జన్మస్థలము హింగుళేశ్వరము
కార్య స్థలమేమోకూడల సంగమేశ్వరము
ప్రామాణికమైన గ్రంథం బసవ పురాణము
వీటి విశేషాలు తెలుపును కనక శాసనము
కర్ణాటకరాష్ట్రంలో కీర్తిపొందె బసవడు విఠల!
73
జైన మతాభిమాని మహారాజు బిజ్జలుడు
ఆయన శివ భక్తులనెంతో గౌరవించేవాడు
సదా మతసామరస్యతను కోరుకునేవాడు
బలదేవుని నాయకుడిగా నియమించాడు
అతడు బసవనికి ఆస్థాన పదవినిచ్చె విఠల!
74
బిజ్జలునికి మేనల్లుడు ఈ బసవేశ్వరుడు
అతడు సహజంగా దైవాంశ సంభూతుడు
పదవిలో ప్రతిభ పాటవము ప్రదర్శించాడు
రాజు మరి బిజ్జలుని మన్ననలు పొందాడు
బసవడు రాజ్యంలో భక్తికి కేంద్రమయ్యె విఠల!
75
రాజ్యంలో భవన నిర్మాణం జరుగుచుండెను
కార్మికులకప్పుడొక శిలాశాసనము లభించెను
బిజ్జలుడు విద్వాంసులను చదవమని చెప్పెను
రహస్య భాషను విడమరిచి విప్పి చెప్పమనెను
వారు ఈ సాంకేతికభాష చదువలేమనిరి విఠల!
76
శాసనకర్తలు ఏదో రహస్యము దాచారు 
వారు సంకేత భాషలో నిక్షిప్తము చేశారు
రహస్య భాషనెవరంటే వారుచదువలేరు
విద్వాంసులందరు మాకు తెలియదన్నారు
రాజుతో బసవన్నను పిలుద్దామనె బిజ్జలుడు విఠల!
77
రాజు ఆజ్ఞతో బసవన్న అచటి కొచ్చాడు
బిజ్జలుడతనకి శాసనం చదువమన్నాడు
బసవడు మనసులో శివుణ్ణి తలిచినాడు
ఆ పురాతన శాసనాన్ని చేతితో తాకినాడు
మీరు కాలచూరి రాజ్య వంశస్థులనె విఠల!
78
ఇక్కడ పశ్చిమ చాళుక్యులు పాలించారు
వారి కాలంలో అనంత నిధిని దాచిపెట్టారు
దాని వివరాలను ఈ శాసనములో రాశారు
బసవడనగానే నిధి వివరాలు తెలుపన్నారు
సమీప కొండ దగ్గర తవ్వించండనె బసవన్న విఠల!
79
బసవడు చెప్పినట్లుగా అందరూ వెళ్లారు
తటాకం దగ్గరున్న వృక్షాన్ని చేరుకున్నారు
పని వారితో,పాత్రలతో కొండను చేరినారు
బసవన్న చెప్పిన చోట తవ్వకాలు చేశారు
తవ్వుతుంటే అపార సంపద కనబడె విఠల!
80
చాలా బంగారపు ఆభారణాలు కనిపించాయి
వజ్రవైఢూర్యాలు మిరుమిట్లుగొల్పుతున్నాయి
రత్న మాణిక్యాలు ధగ ధగా మెరుస్తున్నాయి
సంపదను ఎన్నో నాగులు కాపల కాస్తున్నాయి
మంత్రాలు పఠించి నిధి రాజుకు ఇచ్చిరి విఠల!

కామెంట్‌లు