అమ్మ మాట వినకుంటే ఎలా ... డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

  ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది. దాని అల్లరి చూసి అందరూ నవ్వేవారే గానీ ఎవరూ కోప్పడేవారు కాదు. దానికి అడవంతా తిరగాలని ఒకటే కోరిక. అమ్మకి కూడా చెప్పకుండా చానాచానా దూరాలు పోయొచ్చేది.
ఒకరోజు వాళ్ళమ్మ దాన్ని పట్టుకోని ''చూడు పాపా... ఈ అడవిలో సింహాలు, పులులు లేవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈపాటికి వాటికి ఆహారం అయిపోతా వుంటివి. అందరిలాగా అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు అని నేను చెప్పను. పదిమందిలో కలవాల. కొత్త విషయాలు తెలుసుకోవాల, అనుభవాలు పంచుకోవాల, తిరగాల... అప్పుడే లోకజ్ఞానం వచ్చేది. కానీ ఒక్కమాట అడవిలో ఎక్కడైనా తిరుగు ఏమయినా చెయ్‌. కానీ అడవి దాటి పోవద్దు. అక్కడ మనుషులు వుంటారు. వాళ్ళు చూడడానికి నీలాగే అమాయకంగా వుంటారు గానీ చానా మంది పులులు, సింహాలు, గుంటనక్కల లాంటి వాళ్ళు. వాళ్ళ కంటబడినా, చేతికి చిక్కినా అస్సలు వదలరు. కమ్మగా కూర వండేసుకుంటారు'' అని చెప్పింది.
జింకపిల్ల అలాగేనంది. కొంతకాలానికి అడవిలో అది చూడని చెట్టు లేదు. ఎక్కని గుట్ట లేదు. కలవని జంతువు లేదు. ఈదని చెరువూ లేదు. ఇంకా కొత్త కొత్తవి చూడాలని దాని మనసు ఒకటే గోల చేసేది. దాంతో అడవి దాటి, మనుషులను చూసి రావాలి అనుకొనింది. అమ్మ మాట మతికి వచ్చింది. ఏమీ కాదులే... తల్లులు ఎప్పుడూ అలాగే గదా చెప్పేది అనుకొనింది.
నెమ్మదిగా అడవి దాటి అడుగులో అడుగు వేసుకుంటా ఒక ఊరివైపు వచ్చింది. ఒక ఇంటి ముందు చిన్న పిల్లవాడు వున్నాడు. అమాయకంగా వున్నాడు. వాడు జింకపిల్లను చూసి ముద్దుగా నవ్వినాడు. జింకపిల్ల గూడా కలుపుగోలుగా నవ్వింది. దగ్గరకు రమ్మని పిలిచినాడు. పోదామా వద్దా అని ఆలోచించి ఏమీ కాదులే అనుకోని దగ్గరకు పోయింది. వాడు సంబరంగా దాని ఒళ్ళంతా నిమిరినాడు. ముద్దు పెట్టుకున్నాడు. పచ్చగడ్డి నోటికి అందించినాడు. బాగా ఆడుకున్నాడు. జింకపిల్ల గూడా ఆడీ ఆడీ అలసిపోయి అక్కడే నిదురపోయింది.
కాసేపటికి ఆ పిల్లవాని అమ్మానాయన ఇంటికి వచ్చినారు. అక్కడ పడుకోని వున్న జింకపిల్లను చూసినారు. ఆ పిల్లోని నాయన ''అరే... అడవి నుంచి తప్పిపోయి వచ్చినట్టుంది. బలే బలంగా, లేతగా వుంది. అమ్మితే డబ్బులే డబ్బులు'' అనుకుంటా చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి లటుక్కున దాన్ని పట్టేసుకున్నాడు. జింకపిల్ల అదిరిపడి లేచింది. తప్పించుకోడానికి పెనుగులాడింది. కానీ వాని బలం ముందు దాని బలం సరిపోలేదు. వాడు ఒక తాడు తీసుకోని వచ్చి దాన్ని పెరటిలో కట్టేసినాడు. అడవిలో హాయిగా ఎటు పడితే అటు తిరిగిన దానికి అక్కడ అలా ఒక్కచోటనే వుండడం చేతగావడం లేదు. తప్పించుకోవాలని తెగ గింజుకోనింది. కానీ ఆ తాడు చానా లావుగా, బలంగా వుంది.
అడవిలో అమ్మ తన పిల్ల కోసం ఎదురు చూడసాగింది. రోజూ ఎక్కడెక్కడ తిరిగినా చీకటి పడే సమయానికంతా ఇంటికి వచ్చి ఒళ్లో వెచ్చగా పడుకొనేది. అలాంటిది రెండు రోజులయినా రాలేదు. తల్లి తల్లడిల్లిపోయింది. వెదకని చోటూ లేదు. అడగని జంతువూ లేదు. ఆఖరికి ఒక అడవిపంది జింకపిల్ల వుత్తరంవైపు మనుషులున్న చోటికి పోవడం చూశాననింది. జింక అడుగులో అడుగేసుకుంటా మట్టసంగా పొదల్లో దాచిపెట్టుకుంటా ఆ వూరికాడికి వచ్చింది. ఒక ఇంటిలో జింకపిల్ల కట్టేసి కనబడింది. తాడు చానా లావుగా వుందిగదా... ఎలా తెంపడం అని బాగా ఆలోచించింది.
అంతలో దానికి తనింటికి కొద్ది దూరంలో వుండే ఎలుక మతికి వచ్చింది. పరుగుపరుగున పోయి దానికి విషయమంతా వివరించి ''నువ్వే నా పిల్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు. నీ కొశ్శని పళ్ళతో ఆ తాడు కొరికి దానిని విడిపించవా'' అనింది దీనంగా బతిమలాడుతా.
ఎలుక బాగా ఆలోచించి ''నేనూ పిల్లలున్నదాన్నే... ఆ బాధ నాకూ తెలుసు... కానీ అంతలావు తాడు కొరికే సరికి నా పళ్ళన్నీ అరిగిపోతాయి. ఆ తరువాత నా పిల్లలకు ఆహారం ఎలా తీసుకోని రాగలను'' అనింది.
ఆ మాటలకు జింక ''ఎలుకా... నువ్వు నీ పిల్లలు రోజూ తినేదెంత మీ చిన్ని బొజ్జలను నింపే పూచీనాది. నీ పళ్ళు మరలా బాగయ్యేదాకా అది ఆరునెల్లుగానీ, అరవై నెలలుగానీ మూడుపూటలా పళ్ళూ కాయలు తెచ్చి ఒలిచి పెట్టే పూచీ నాది సరేనా'' అనింది.
ఎలుక సరేనని జింకపైకి ఎక్కి కూచోనింది. రెండు చీకటిపడే సమయానికంతా జింకపిల్ల వున్న చోటుకు పోయినాయి. అందరూ పండుకున్నాక ఎలుక పోయి నెమ్మదినెమ్మదిగా తాడు కొరకసాగింది. ఒక్కొక్కపోగు తెగిపోతా తెగిపోతా ఉదయానికంతా తాడు మొత్తం తెగిపోయింది. అంతే... జింక ఎలుకను మీద కూచోబెట్టుకొని పిల్లతో కళ్ళు మూసి తెరిచేలోగా అడవికి చేరుకొనింది.
అమ్మ మాట వినకుంటే ఎలా ... (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
**********

***********

కామెంట్‌లు