రవి వచ్చి రాజు రాకని తెలియజేశాడు సూర్యోదయం వేళ చీకటి పరిగెత్తి వెలుగుతో నిండిపోయింది ఉదయాద్రి పైకి వచ్చి భానుడు ఉక్కురుడయ్యాడు. రామరాజు రాసిన ఉత్తరాన్ని చూసినవారికి అధికారులకు గుండెలు అవిసిపోతున్నాయి ఎటు నుంచి వస్తాడో ఎలా వస్తాడో ఏ ఒక్కరికి తెలియదు వచ్చిన రాజు ఏం చేస్తాడో కూడా వీరు ఊహించలేకపోతున్నారు పోలీసులు పోయి కూర్చున్నారు అక్కడ దిక్కులు చూసుకుంటూ కనులు మూయడానికి కూడా భయపడుతున్నారు ఆ సమయంలో జయ ఘోషలు పిక్కటిల్లుతూ విల్లులు చేతబట్టి మెరుపు మెరిసినట్లుగా మల్లె దొరడు చుట్టుముట్టారు. సింహం కన్నా బలమైన జంతువు ఉన్న ఏనుగు ఉగ్రరూపంతో వచ్చినట్లుగా రాజుగారు బయలుదేరి వచ్చారు అధికారులు ఎంతో జాగరుకతతో తుపాకులను గురి పెట్టి ఏం చేయడానికి తోచక నిర్వీర్యమై చూస్తున్నారు చీమ చిట్టుక్కుమన్న ఎంత చిరు సవ్వడి అయినా వినిపించేటంత నిశ్శబ్దం అక్కడ ఆవరించి ఉంది ఎక్కడి వారు ఒక్కడే ప్రతిమల్ల నిలబడి నిలువు గుడ్లు వేసుకుని ఉన్నారు చలనమే లేదు ఆ స్టేషన్ మొత్తం చిన్న పోయినట్టుగా ఉంది ఏనుగు పైకి వచ్చే సింహం లాగా రాజుగారు అడుగులు వేసుకుంటూ నడుస్తూ జయ జయ ద్వారాలు పలుకుతున్న జనుల మధ్య నుంచి వస్తున్నారు ఆ వస్తున్న రాజుని చూసి గొంతులు తడి ఆగిపోయి వణుకు తున్న కంఠంతో సలాములు చేస్తూ అలాగే నిలుచుండిపోయారు పోలీసులు రాజు గారిని చూడగానే కూర్చోమని ఆసనాన్ని ఇవ్వడం తర్వాత రాజు నేను మీ సరికొత్త రికార్డులను చూడడానికి వచ్చాను ఎవరెవరిని జైల్లో పెట్టారో ఎందుకు పెట్టారో వివరాలు అవి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంతే తప్ప మీ మర్యాదలు పొందడానికి కాదు నేను వచ్చింది అని గంభీరంగా పలికారు రాజు మాట్లాడిన ప్రతి మాట అధికారులకు ఆజ్ఞ వలే వినిపించింది పాతవి కొత్తవి అన్నీ తీసుకొచ్చి రాజు గారి ముందు ఉంచి వాటిని రాసిగా పోశారు చూసేవారికి ఇదంతా చాలా వింతగా కనిపిస్తోంది రిమాండ్ లో ఉన్న ఖైదీలను రప్పించి వారి రికార్డులను వరుసలు చూసి ఏం నేరము ఎరుగని నిరపరాధులు వీరు పుట్ట తేనె పట్టడం నేరమవుతుందా అన్నాడు రాజు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి