అనసూయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 అనసూయ మాటల్లోని తత్వ రహస్యం ఏమిటో మధుర భావాలు ఏమి ఇందులో నిబద్ధమై ఉన్నాయో వీటిని సీత మాత్రమే గ్రహించగలదు. సౌందర్యం భీషణత్వం కలబోతతో ప్రకృతిలోని కనకణంలో ప్రకృతి పరంగా జరుగుతున్న  సంఘటనలు ఎంత స్పష్టంగా ఆకర్షణేయంగా ఉంటాయో ఇవే అనసూయకు ఆనంద గీతికకు ఆలంబనగా  నిలుస్తాయి ఆమె ఆశయము అదే అనసూయ ఆశీర్వాదం అనుగ్రహం అనురాగాలను  వెంటబెట్టుకుని సీత రాముని వద్దకు చేరుకుంటుంది జరిగినదంతా వినిపిస్తుంది రామునికి రాముడు సీతను అభినందిస్తాడు ఆ రాత్రి అంతా సీతారామ లక్ష్మణులు విశ్రాంతిగా ఆశ్రమంలో ఉండి తెల్లవారగానే మహర్షి అనసూయ నుంచి సెలవు తీసుకొని దండకారణ్యం వైపు బయలుదేరారు ఆశ్చర్యం ఏమిటంటే అయోధ్యకాండ అంతిమ ప్రసంగంలో రాముని ప్రముఖ భూమిక కనిపించదు. అత్రితో కూడా విశేషంగా మాట్లాడినట్టు తోచదు దండ కారణ్యాలకు బయలుదేరే ముందు రాముడు అత్రి ఆశ్రమంలోకి వెళతాడు కారణం. అత్రి మహర్షికి వనవాస విశేషాలు  అనుభవం ఉండడం వల్ల రామునికి కొన్ని ఉపదేశ సూచనలు చేస్తూ జాగరోకతను హెచ్చరించవచ్చు కానీ ఇదేం జరగలేదు సకల సన్మాన సత్కార వ్యవహారాలన్నీ సీత అనసూయ ఆధ్వర్యంలోనే జరిగాయి దీనివల్ల తెలియపరిచింది ఏమంటే జీవితంలో రప్పించే ప్రతిష్టకు విజయ ప్రాప్తికి పురుషుల కంటే స్త్రీ కే ప్రాధాన్యత అత్యధికంగా ఉంటుంది అని శ్రీరాముని యొక్క మానసిక భౌతిక ఆధ్యాత్మిక జీవన విశాలమంతా స్త్రీ యొక్క పవిత్రత నిష్ట దృఢత్వం సేవా తత్పరత మీదనే ఆధారపడి ఉంటుంది అనసూయ  అలౌకిక పాతివ్రత్య మహిమ వల్లనే మహార్షి అత్రి లోక విఖ్యాతుడు అయినాడు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా శ్రీరాముని ఆలౌకిక లీలల ఆధార భూమి జానకి యొక్క సౌకర్యము  సౌశీల్యము సామర్థ్యము సౌందర్యాలపై నడిచి ఉంది ఈ సామర్ధ్యాన్ని పొందటానికి విధాత సూచన మేరకు సీత అనసూయ మహోన్నత సమాగము ఏర్పడింది సీతారాముల ప్రయాణంలో ఈ ప్రసంగం ద్వారా ఆలకించిన వాస్తవిక మహాత్మామే మనకు దృక్కొ చరమవుతుంది. 

శబరి ఏ విధంగానయితే అయోధ్యకాండ చివర అనసూయ సీత సమాసం జరిగిందో  అదే విధంగా అరణ్యకాండ అంతంలో రామునితో శబరి సమాగము జరుగుతుంది రామ కథ వికాసంలో ఒక నిర్దిష్ట సోపానంగా కనిపిస్తుంది దండకా కిష్కింద మధ్యలో పంప సరోవర తీరంలో శబరి ఆశ్రమం నెలకొని ఉంది మతంగ మహాముని వారి శిష్యులు తమ తపోశక్తులతో లోకోత్తర సౌందర్యంతో నిర్మలత్వంతో అతి ఆకర్షణీ యంగా నిర్మించారు రకరకాల పుష్పాలు తీయని పండ్లు అమృతాన్ని మరిపించే స్వచ్ఛ జలాలు ఈ ఆశ్రమ అమూల్య విశేషాలు ఈ ఆశ్రమాల్లోనే నివసించే ఋషి మునులకు సపర్యలు చేస్తూ తన జీవితాన్ని అంతా వారి సేవలో సమర్పించుకోవడమే తన జీవిత పరమావధిగా భావించింది శబరి అంతేకాదు తన వృద్ధాప్య దశను అతి అణకువతో శ్రీరాముని దర్శన తపనతో  తన కాలాన్ని వెల్లదీస్తున్నది శబరి.కామెంట్‌లు