స్వయం ప్రభ;;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 బాహ్య గుహను శ్రీమద్ బీల్ అని అంటారు. ఈ బిలముల యొక్క సశ్రీకతను అర్థం చేసుకోవడం అంటే శ్రీమత్ అనే శబ్దాన్ని అభిద లక్షణ మరియు వ్యంజన మూడు రూపాల్లో ఆత్మ దర్శనం చేసుకోవడం ఆవశ్యకమై ఉంది ఈ వర్ణన అంతా హనుమంతుడు లాంటి మేధావి మాత్రమే హృదయంగమం చేసుకోగలరు అన్యులకు అది అసాధ్యం  స్వయంప్రభలో ఎంత ఆత్మస్థైర్యమున్నదో అంతే ఆత్మ నియంత్రణ కూడా ఉన్నది తన తపోవనం యొక్క పూర్తి చరిత్రను హనుమంతునకు వివరించింది  అతిథి సత్కారం చేసిన తర్వాత వారి రాకకు కారణం అడుగుతుంది అది కూడా వారిని అభ్యంతరం లేకుంటేనే చెప్పమని కోరుతుంది  యది చైతన్యయ శ్రావ్యం శ్రోతుమిచ్చామితాం  కథాం  దీనికి హనుమంతుడు రాముని కథంతా వినిపిస్తాడు శ్రీరాముడు దండకారణ్య ప్రవేశం సీతాపహరణం రామసుగ్రీవుల మైత్రి సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఓనర సైన్యంతో నలుదిక్కులకు వెళ్లడం దర్శనానికి హనుమంతుని ప్రయాణం. దారిలో దాహం వేయడం బిల ప్రవేశపక్షులను చూడడం బిల ప్రకాశంతో రమణీయ వన దర్శనం అందరూ సంతృప్తి చెందటం తాపసి ఆదర సత్కారాలు ఈ విషయాలన్నీ హనుమంతుని నోటి ద్వారా విన్న స్వయం ప్రభకు ఆనందం కలుగుతుంది  ప్రాణ సంకటం నుంచి తమందరినీ కాపాడిన స్వయం ప్రభకు హనుమంతుడు కృతజ్ఞతలు చెప్పాడు ఇలా దేవి ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగా మేము మీకు ఎలాంటి సేవ చేయగలము సెలవియ్యండి అని ధర్మ హితమైన వాక్యాలు వినిపిస్తూ ఉంటుంది ధర్మాచరణలో నిమఘ్నురాలునైన నేను ఇతరుల నుంచి ఏమీ అపేక్షించను ఇతరులు నాకేమీ చేయలేరు. ఈ మంత్ర వాక్కులు  స్వయం ప్రభ నుంచి జాలువారుతున్న సమయంలో ఆమె ముఖవర్చ్యస్సు  కనిపించే దివ్యకాంతి హృదయంలో నిందిన అమందానందాన్ని  గుర్తించగలిగిన సూక్ష్మ బుద్ధిశాలి హనుమంతుడు  స్వయంప్రభ తో ఇలా అంటాడు.
దేవి మేము ప్రాణ సంకటాన్ని నుంచి బయటపడ్డాం కానీ ఒక ధర్మ సంకటం మమ్మల్ని వేధిస్తోంది మీరు మా ప్రాణాన్ని కాపాడారు అలాగే మా ధర్మాన్ని రక్షించండి సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం ఒక నెల లోపల సీత జాడ తెలుసుకొని తిరిగి వెళ్ళాలి కానీ మా అన్వేషణలో నెల గడిచిపోయింది మేము ఎటు తిరిగి వెంటనే వెళ్ళిపోవాలి ఈ బిలాన్ని దాటి బయటకు వెళ్లాలి ఈ బిలంలోకి ప్రవేశించామే కానీ బయటకు వెళ్లిపోవడం తెలియడం లేదు ఇందుకు మీ సాయం అవసరం మేము ఎలా బయటపడాలో మార్గాన్ని నిర్దేశనం చేయండి హనుమంతుడు ఇంతటి బలశాలి కూడా ఈ చిన్న విషయంలో ఒక అబల సహాయం అడగడానికి సంకోచిస్తూనే ఉన్నాడు కానీ గత్యంతరం లేదు  కానీ స్వయంప్రప సాధారణ మహిళ కాదని సిద్ధ సాధ్వి అని తెలుసుకోవాలి.

కామెంట్‌లు