ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అతడు ధర్మానిష్ఠుడు మహాబలశాలి అనంత ధైర్య సాహసలు గల దేశభక్తి  యుతుడు. అతనే ప్రతి క్షణం కాంగ్రెస్ సేవకుడు లాగా ఉండడం విశేషం  ఏ కొంచెం కూడా స్వార్థ చింతన లేకుండా  అగ్గిరాజు గాంధీ మహాత్ములకు భక్తుడయ్యాడు  స్వాతంత్రియని కోరి సేవలను చేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో కార్యకర్తగా ఉన్నాడు గునుపూడు గ్రామాన జరుగుతున్నటువంటి శివరాత్రి రథోత్సవ  సమయంలో  రమ్యమైన ఆ రకాల స్వామి ఆ మహేశ్వరుని చెంత గాంధీజీ  పటము నెలకొల్పదలచి అడవి బాపిరాజు ఆలూరు వెంకట నరసింహారాజులు నాయకుడిగా ముష్టి లక్ష్మీనారాయణ సంతుష్టుగా చేసి జస్టిస్ పార్టీతో జగడమాడి ఆధారముతో మహాత్ముని అధిష్టింప చేసి జనములు జేజేలు చెబుతూ ఉండగా  పులకితుడయ్యాడు. అతను ఎంతో పుణ్యమూర్తి  అలాంటి వీరుడు ధీరుడు అగ్గిరాజు  అహింసా వ్రతాన్ని ఆచరించాలనుకున్న వారి  సత్యాగ్రహం అందరినీ చేర్చి  చావగొట్టి చెరసాలలో వేస్తూ ఉన్న సమయంలో  ఆ దొరలపై కసి పెరిగి  ఇది ఏమి కాంగ్రెస్  అంటూ ఉద్రేకాన్ని పొంది  ఆ ఉద్యమాన్ని వదిలి వేసి తిరుగుబాటును  చేయాలని ఆలోచన చేశారు  అప్పుడు కలకత్తా వెళ్లడం కోసం  అల్లూరి వారి గాథలను వినిపించడకోసం రైడ్లో బయలుదేరారు  అన్నవరంలో అల్లూరి వీరగాథ కథలుగా చెప్పగా  మనసులో కోరికలు పెరిగి  ఈనాటికి దొడ్డ నాయకుడు దొరికాడు అంటూ తలచి  రైలు దిగిపోయాడు  అన్నవారాన్ని వదిలాడు  అల్లూరి వారిని గురించి నిన్ననే  నిజమైన విషయాలు తెలిసి  వారినే మనసులో తడుచుకుంటూ ఆ సాహసానికి జోహార్లు చెబుతూ  అక్కడకు చేరాడు  అగ్గిరాజు.
అగ్గిరాజు ఆ వనములో వెతికి వెతికి విసిగి వేసారి చివరికి అల్లూరి వారి చెంత చేరాడు  ఇతని సాహసము విఫల కాంక్ష తెలిసి రామరాజు దీవెనలను ఇచ్చాడు  విప్లవ సోదరులు అందరూ ఆనందంతో ఉన్నారు  అతనిని కౌగలింతలతో  ఆహ్వానించారు. వారి హృదయాలన్నీ పులకించిపోయిన ఆరోజు దానిని ఒక  ఉత్సవంగా జరుపుకున్నారు అందరూ  రాజు అందరి ముందు అతనిని  అందముగా కౌగిలించుకొని ఆనందంతో నా తమ్ముడిలా ఎక్కడ ఉండు  ఏ విధమైన ఆలోచనలు లేకుండా  అనుమానాలకు చోటు లేకుండా  గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం కోసం మనం ఈ  ప్రయత్నం చేస్తున్నాం దానికి నీవు కూడా మాతో పాటు ఒక సహచరి కావాలి  అన్నాడు రాజు.


కామెంట్‌లు