ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 పంజాబ్ రాష్ట్రంలో గదర్ పార్టీ పేర స్వాతంత్ర్య వీరుల సమితిని నెలకొల్పి  విప్లవ పోరాట బాటలో ప్రయాణం చేస్తూ ఉన్న పృథ్వి సింగ్ అనేటువంటి వీర యోధుడు ఒకడు  రాజమండ్రి కేంద్రచరసాలలో ఉన్నాడు  అతను రామరాజుకు  మంచి స్నేహితుడు  అతనిని విడిపించడానికి సిద్ధమై వచ్చి  ఆ చెరసాలాధికారులకు ఒక లేఖ వ్రాసి పంపాడు  లేనప్పుడు  సింగ్ తోమాట్లాడాలని అనుకుంటున్నాను  చెరసాలకు వచ్చి చేరతాను  అంటూ ఉత్తరం రాసి పంపాడు  ఆ లేఖనందుకొని హడలి పోయి  హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడు  చెరసాలలో ఉన్న జీవిత ఖైదీలను తరలించి వేశారు ఎంతో త్వరగ  పృథ్వి సింగ్ ను మద్రాస్ జైలుకుమార్చారు  జైలు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయారు. రాజమండ్రి చైల్డ్ వరకు వచ్చి రాజు ఆ పరిస్థితిని చూశాడు  అంతా బోసిపోయి ఉంది ఒక పురుగు కూడా ఆ ప్రాంతంలో లేదు ఎలాగైనా  రాజు  సింగును కలిసే ప్రయత్నం చేస్తున్నాడు  పేరుకు దొరలు కానీ వీరంతా పిరికివారు వంచన చేయడం తప్ప వీరత్వం కొంచెమైనా లేదు  అనుకుంటూ రాజు ఎంతో నవ్వుకుంటూ రాజ వీధిని సింహంలా నడచి వెళుతున్నాడు  యువతలో కొంత ఉత్సాహం ఉదయించింది వారి హృదయాలలో విప్లవాగ్ని రేగి రెండు తలల శిఖండులై ఉన్న వాళ్లకు  వేడి తగలడం లేదు  ఈ అపజయపు వార్త అధికారులకు  చేరి  రాజుకు ఇచ్చే నీరాజనములను గాంచి ప్రజల స్పందన చూసి పోరాడ లేమని ఆలోచన చేశారు వారంతా కలిసి  పైకి వ్రాసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు రాజ తంత్రమున రాటుదేలి పెద్ద పేరు  ఉన్న రూథర్ఫర్డ్ను అడవి కమిషనర్ గా పంపించినారు.
నక్కజిత్తుల వాడు  నయవంచకులలో మేటి  కుటిల తంత్రములను పన్నుటలో మేధావి  హింస చేసి క్రాసు నెత్తి మ్రొక్కేడి వాడు  మోసగాడు  మాయలు మంత్రాలు చేస్తూ ఉంటాడు  ఇది విన్న రూథర్ ఎత్తుగడల మార్చి సంధి పేరున పిలిచి  బంధిగా చేయాలి అన్న అభిప్రాయంతో ఉత్తరం ఒకటి ఎంతో నేర్పుగా వ్రాయించి  ఆ రాక్షసుడు రాజకు పంపించాడు  ఏ విధంగా చూసినా రాజును బంధించడం వీరి తరంగాక  సంధి అంటూ మాకు బుద్ధి వచ్చింది అని ఎంతో  ఒద్దికతో  వారికి మరొక లేఖ వ్రాశారు  ఆ ఉత్తరాన్ని చూసి రాజు తన మిత్రులతో సంప్రదించి వారికి తిరిగి ఒక ఉత్తరం రాశాడు  మైత్రికి రమ్మని మమ్మల్ని మీరు కోరారు  ఈ పద్ధతి మాకు ఎంతో నచ్చింది  మీరంతా శాంతిని కోరి మమ్మల్ని  పిలవడం  ఎంతో మెచ్చుకోవలసిన విషయం  ఎంతోకాలం ఈ బుద్ధి లేక ప్రవర్తించారు మీరు చెప్పినట్టుగానే వస్తున్నాను అని వ్రాశారు.


కామెంట్‌లు