ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఏమీ ఇది మీ రాజ్యమా  గోమాతల వంటి మేము  కరుణను చూపితే ఎంతో ప్రేమను  నటిస్తూ మోసం చేసిన  మీ మాయలో పడి ఈ రాజ్యం మీకు దక్కింది  యుగయుగాల నుంచి తల్లి ఒడిలో సేదతీరుతున్న జాతి మాది  అతిథులు అనే వారు ఏ వేళలో వచ్చినా  వాటిని ఎంతో ఆదరంగా  చూసే జాతి  దానిని సాకుగా తీసుకొని మమ్మల్ని ఆశ్రయించి వ్యాపారం కోసం బ్రతకడానికి వచ్చి  మేమంటు దొంగ జపంలు చేస్తూ కొంగల్లాగా అన్నదమ్ముల మధ్య ఆరడి సృష్టించి సాయపడుతమంటూ సందు చూసి మోసం చేసి దేశాలను అపహరించి దోచుకుని పోయే మా దొడ్డ నీతి   మీది  మానవతా సత్య శీలత మా నీతి  మీకు మాకు  ఏ విధంగా సామ్యం సమకూరుతుంది  అనగానే రూథర్ఫర్డ్ అహంకరించి  రవి అస్తమించని రాజ్యమున ఘన చరిత్ర మాది  భారతదేశానికి బానిసత్వం తప్ప వేరే ఏదైనా కలదా  అనగానే ఉగ్రుడైన రాజు  రవి అస్తమించని సామ్రాజ్యమా మీది  ఇలాంటి అతిశయాలతో అబద్ధాలతో  ఎందరిని ఎంత కాలం మోసం చేయగలరు  గొర్రె తోక ఎంత ఉందో అంత ఉంటుంది మీ దీవి  సముద్రంలో దొంగల్లాగా ఓడ సరుకులను దోచుకుంటూ బ్రతికిన బహుదొంట చరిత్ర మీది అతిధి అభ్యాగతులను ఆధారంగా పిలిచి  సిద్ధాన్న మిడిన జాతిరా మాది ఈ మహా ప్రపంచంలో ఒక చిన్న మరుభూమి రా మీ జన్మభూమి సస్యశ్యామలమైన సువిశాల క్షేత్రమై బంగారు పంటలు పండే  భూమి రా మాది  ఆయుధాలపై ఆధారిపడే బ్రతికే జాతి నీతి  మీ జీవితంలో మృగతత్వం తప్ప మరేమీ కనిపించదు  శాంతి అహింసలతో సమతను మమతను నింపి  జ్యోతులను వెలిగించిన నీతి గల జాతి రా    మాది. ఆ ధర్మమే సిద్ధాంతం గా బ్రతికే జాతి 13 సంవత్సరాల మాత్రమే నిలిచి ఉంటుంది  ధర్మ మార్గంలో నడిచే నా జాతి  వేయి ఏండ్లు అయినా అలా నిలిచే ఉంటుంది  మీ రాజ్యం ఇంకా నిలిచి ఉండేది ఐదు సంవత్సరాలు మాత్రమే  ఆ తర్వాత మా రాజ్యం అవతరిస్తోంది  అని పలికిన రాజు మాటలను విని ఆంగ్ల ద్వారా  నాగరికత పంచినాము  మీకు ఉద్యోగాలను  ఇవ్వడం కోసం విద్యలను నేర్పించాము  రైలుబండ్లకు  మార్గాలను మేము వేయలేదా  ఆ మాటలు విన్న రాజు అలవోకగా నవ్వి  మా చెవులలో మీకు పువ్వులు కనిపిస్తున్నాయా  మీరు చేసిన గొప్ప పనులన్నీ కూడా చెబుతూ ఉన్నారు  నేనేమైనా చంటి పిల్లవాడిని అని  అనుకొని చెప్తున్నారా అన్నాడు రాజు.కామెంట్‌లు