తార;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 భారతీయ పౌరాణిక వాంగ్మయంలో కనిపించే పంచ మహా కన్యలో తారకు కూడా గణనీయ స్థానం ఉంది ప్రాతః కాలం మేల్కొనగానే వీరి స్మరణతో సర్వపాపాలు హరిస్తాయని ఒక విశ్వాసం ప్రబలంగా ఉంది  కానీ తార పేరుతో ఇద్దరు మహిళలు ప్రసిద్ధిగాంచారు దేవతల రాజ పురోహితుడైన బృహస్పతి  భార్య తార ఒకరైతే, వానర రాజు వాలి భార్య తార రెండో మహిళ  ఈ ఇద్దరిలో ఎవరు మహాకన్యల్లో ఒకరుగా పరిగణించబడతారని విషయం వివాదాస్పదమైంది  అభిప్రాయ భేదాలు ఉన్నాయి కొందరు ఇద్దరినీ వారిలో చేర్చడం భావ్యమని తలుస్తారు  ఏది ఏమైనా  ఇద్దరిలోను చాలా సామ్యం కనిపిస్తోంది బృహస్పతి భార్య తార  సంబంధం తన భర్తతోనే కాదు చంద్రునితో  కూడా ఉందని చెప్పబడింది. దీనివల్ల సామాన్య మానవుని దృష్టి వీరిని పవిత్రులుగా స్వీకరించడానికి  క్లిష్టమైనది  వీరి చరిత్రలో విడదీయరాని ఎన్నో భావాలు ప్రస్పుటిస్తూ ఉంటాయి. అందుచేతనే వీరి చరిత్రను బహు తిక్షన దృష్టితో లోతుగా అనేక కోణాలను పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది బృహస్పతి భార్య తార ఆరాధనా భావాన్ని హృదయావగతం చేసుకోవడం అంత కష్టమైన పని కాకపోవచ్చు ఎందుచేతనంటే ఆమె జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన ఒక ఖగోళ జ్యోతిర్మయి శక్తి స్వరూపిణి అటువంటి ఈమెను మానవ జీవితపు నైతిక కొలమానంతో కొలవడం ఆ ప్రకారంగా నిర్ణయం కావడం సముచితంగా తోచదు కానీ రామాయణ మహిళ తారగా ఆమెను వాల్మీకి మహర్షి తన రిషి దృష్టితో ఎలా చిత్రీకరించాడో తెలుసుకోవడం ఎంతటి జాగరోకతను ప్రదర్శించాడో తెలుసుకోవడం  అచ్చావా శేఖర్ తోస్తోంది  అత్యవశ్యకంగా తోస్తోంది.
కథను కేవలం కథా రూపంలో స్వీకరించడంతో కథ యొక్క వాస్తవరూపం బోధపడదు  తార ప్రతి మాట వాల్మీకి ఆమెకు సంబంధించిన వర్ణించిన ప్రతి శబ్దాన్ని పర్యావరణ ఆకారంగా నిశిత పరిశీలన చేస్తేనే తప్ప అసలు విషయాన్నీ మనం తెలుసుకోలేము  వాల్మీకి రామాయణంలో తార తన భర్త వాలిని పదేపదే ప్రాదేయపడి అడుగుతూ తమ్ముడు సుగ్రీవునితో అనవసరంగా యుద్ధం చేయవద్దని నచ్చచెప్పుతుంది ఒకవేళ యుద్దం చేయవలసి వస్తే కొంచెం ఆగి కొంత సమయం తర్వాత చేయవచ్చునని సలహా ఇస్తుంది ఈ దృశ్యం లోనే మనకు తార మొదటిసారిగా కనిపిస్తుంది ఈ సంభాషణలో తార తన భర్తను సాధు అంటూ సంబోధిస్తోంది ఒకసారి అన్న చేతిలో యుద్ధంలో పరాజయం పాలైన సుగ్రీవుడు మళ్ళీ నూతన ఉత్సాహంతో అధిక బలంతో ఎందుకు యుద్ధానికి  సన్నద్ధుడు అవుతున్నాడో అన్న విషయం తారను కంగారుపెడుతుంది.


కామెంట్‌లు