ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 అన్నవరంలో అన్ని స్టేషన్లను  కూడి మరికొంత సేనను తయారు చేసుకొని ఎత్తులు వేయడానికి సిద్ధంగా ముందుకు వచ్చారు  వ్యూహాలు పన్నారు ఆ సమయంలో  మిరపకాయ కట్టిన మెరుపులాగా ఉత్తరం ఒకటి వచ్చి పడింది వారి మధ్యలో నాలుగోవ తేదీన  నేను వస్తున్నాను అక్కడ సత్యదేవుని వ్రతం చేయాలి అని నా సంకల్పం  మీరు అక్కడ ఉన్నట్లయితే మీతో మాట్లాడి దైవ దర్శనం చేయించి తిరిగి వస్తాను అంటూ ఆ ఉత్తరంలో ఉంది  ఆ ఉత్తరాన్ని చూసి  పెద్ద దొరలందరూ కాపు వేశారు  రాజు వ్యూహము తెలియడం కోసం  ఆరాటపడుతున్నారు  రాత్రికి రాత్రి అన్నవరం వదిలిపెట్టి వెళ్లిపోయారు  ప్రాతకాలంలోనే రాజు వచ్చాడు. రాజును  అనుసరిస్తున్న మన్యవీరులందరూ అక్కడకు వచ్చిన  క్షణాల్లో వైరివీరులు  ఎవరు కూడా  కనిపించకుండా వెళ్లిపోయారు  వారంతా ఎంతో వింతగా పారిపోయారని వేగులు చెప్పగా వీరంతా నవ్వుకున్నారు  రాజు ఆ తర్వాత దైవ సన్నిధికి వెళ్ళాడు   వీధుల వెంట  రాజు తిరుగుతున్నాడు అన్న సమాచారాన్ని తెలిసిన  అధికారులు ఎంతో భయపడి పరుగు పరుగున వచ్చారు  గడగడ వణుకుతూ కాచి రక్షించమని  వేడుకొన్న తరువాత వారి వీపు నిమిరి చెప్పాడు రాజు  మీకు భయం లేదు మీరందరూ భారతీయులు మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు  కడుపు నింపుకోవడం కోసం మీరు కొలువు చేస్తున్నారు  మీరు చేసేది నేరం ఎలా అవుతుంది  మీరందరూ నా స్నేహితులు నా సోదరులు.
మీరందరూ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతిజ్ఞ చేయండి  మీరు ఎవరు పేద ప్రజలను బాధ పెట్టకండి  నీతి తప్పిన వారిని ఎవరిని వదలవద్దు  భారతీయుల నీతి బాట వదల వద్దు  మీ దగ్గర ఆయుధాలు ఉంటే అవన్నీ నాకు అప్పగించండి. వీరులతో పోరాడడానికి పనికి వస్తాయి  అని పలికినప్పుడు  మా దగ్గర ఒక్క ఆయుధము లేదు ఉన్నవన్నీ దొరలు  సంగ్రహించి తరలిపోయారు  నిజం చెప్తున్నాం మా మాటలు నమ్మండి అంటూ పలుకగా  వారిని అనునయించి నవ్వుకుంటూ రాజు  నడివీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే  ఆ దృశ్యం రథయాత్ర లాగా కనిపించింది ఆ రాజవీధి మొత్తం  వీరుడా రమ్మని ఎంతో ప్రేమతో ఎదురు వచ్చి పూలదండలు వేసి పొగిడారు రాజు గారిని.

కామెంట్‌లు