నిజానికి ఆ సరుకులన్నిటినీ వీర సైనికుల కోసం పంపించారు వారు ఆ దారిలో ఒక ప్రక్క ఎత్తైన కొండలు ఒక ప్రక్క లోతైన ఏటి వాలు ఇరుకు దారి అక్కడ 7 వంపులు కలిగిన మార్గాలు ఆ వంపులకు రెండు ప్రక్కల వెదురు చెట్లు బండ్లకు ముందు వెనుక పోలీసులు ఎలాంటి శబ్దం లేకుండా బండ్లు సాగుతూ ఉన్నాయి. ఆ ప్రక్కన నక్కల ఊలలు ఒక్కసారిగా లేచినాయి కొండ నిండా కుక్కల అరుపులు చెట్ల పైన పక్షులన్నీ చేరి ఆకాశంలో గుంపులుగా అరిచి గోల చేస్తూ ఉండడం భీకరమైన బెబ్బులి ఒకటి బండ్ల మధ్యకు దూసుకుని వచ్చిన దృశ్యాన్ని చూస్తూ బెదిరిన ఎడ్లు బండ్ల చిడతలను విడిచి ఏ మార్గం కనిపిస్తే అటు పరిగట్టడం మొదలుపెట్టాయి ఒక్కసారిగా వెనక ముందు తుపాకులు మోగినాయి. పోలీసులు ఏ దిక్కుకు పారిపోయినారో తెలియదు ఏ ఒక్కడు కంటికి కనిపించడం లేదు బండ్లు మాత్రం చాలా భద్రంగా ఉన్నాయి. ఇరువైపుల నుంచి విప్లవ వీరులు అక్కడకు వచ్చారు అందరి ముందు నాయకుల్లా నిలబడ్డారు అగ్గిరాజు ఆజ్ఞలను ఇస్తూ బండ్లను మోకులుగట్టి వీరులు లాగుతూ ఉండగా ఆ బండ్లను తీసుకుని వెళ్ళారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ వార్తలు తెలిసిన దొరలు అక్కడకు వచ్చారు. బండ్లలో సరుకులు లేవు బండ్లు లేవు బండ్లు పోయిన జడ కోసం ఎంతో వెతికారు కొంత దూరం వెళ్లిన తర్వాత జాడ కనిపించింది ఆ తర్వాత ఆ జాడ మాయమైపోయింది జాడా లేదు బండ్లు లేవు ఆ బండ్లు ఏమైనాయో తెలియడం లేదు ఎంత వెతికినా కనిపించడం లేదు ఎంతో వింతగా ఉన్నది అంటూ వెతుకుతున్న దొరలు హతాసులైనారు. ఎంతో బాధపడుతూ జిల్లా కేంద్రానికి వచ్చి చేరారు అగ్గిరాజు ఇలాంటి పోరాటాలు ఎన్నో చాలా వింతగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అతడు అనేక వ్యూహాలలో ఆరితేరిన వీరమూర్తి అతనికి మనసులో భయము అన్న మాట తెలియదు. యుద్ధం మొదలుపెడితే మహోగ్రుడై శత్రువులను మట్టు పెట్టడం మాత్రమే తెలుసును జయ జయ నినాదాలతో మన కేతనాన్ని ఎగురవేయడమే సాహసంతో చేసే పని రాజు అతనిని చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంగా కనిపిస్తున్నాడు చేసే పని ఎంతో పవిత్ర ఆత్మతో చేస్తాడు ఒక్కొక్క సమయంలో రాజు ఆజ్ఞ లేకుండానే ఉగ్రుడై సమరరంగాల్లోకి పరుగు పరుగున వెళ్లేవాడు అన్ని వేళలు మనవి కావు రాజా తొందరపాటు పనికిరాదు అని రాజు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి