ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 దివ్య గంగా తరంగాలు తేలి తేలి ఈ వ్యాస వాల్మికి వాక్ సుధలు గ్రోలి గ్రోలీ పుణ్యశీల పరమ సుగుణాలవాల ఈ  భరతు నేల  ప్రపంచ ప్రజానీకానికి ఆదర్శప్రాయమైన   ఆదికావ్యం  దివ్య పురుషులకు నెరవైన తీర్థభూమి  పాతివ్రత్యం పండిన పుణ్యభూమి  ఈ భరతావనిలో పుట్టిన మాటలే వేదం  అని భరతమాత ఔన్నత్యాన్ని గురించి చెప్పడం  సీతారామరాజు గారి ఆత్మ   అభిమానానికి నిదర్శనం  ఇంతకూ నన్ను ఎందుకు పిలిచావు అది చెప్పు  దానికి సమాధానం  నీవు ఈ విప్లవ మార్గాన్ని విడిచిపెట్టు  అది నీకు క్షేమం  అప్పుడు నిన్ను మేము మన్నించగలం అన్నాడు  ఆ మాట విన్న  రామరాజు  తోక తొక్కిన త్రాచు పాముల లేచి  ఇందుకోసమేనా మమ్మల్ని పిలిచి ఇంతసేపు ఆయాసపడ్డావు  ఫలితం లేని మాటలు ఎందుకయ్యా పలుకుతావ్  నన్ను పసిపిల్లవాడికా భావిస్తున్నావా ఏ స్వాతంత్రం కోసం ఈ క్షణం వరకు మేము పోటీ పడ్డామో అది లభించే అంతవరకు ఈ యుద్ధం ఆగదు  మీరు ఈ మన్యాన్ని విడిచి మీ దారిని మీరు వెళ్ళండి అప్పుడే  మా పోరు అంతమవుతుంది నా దేశ ప్రజల హృదయాలలో స్వాతంత్ర భావ స్పందనలు లేక పూరించినాడని పాంచ జన్యమును  వెలిగించినాడు ఈ విప్లవ జ్యోతి మా భూమి మాకు ఇవ్వడానికి మీకు ఏమిటి బాధ అనగానే  సప్త భుజంగమై బుసబుసలు రేగి కస్సుమంటూ పలికాడు కావరంతో  బొజ్జగించాను అయినా నీ బుద్ధి మారలేదు చుతువా మా శక్తి  చుట్టుముట్టిన సైనిక శక్తి చూడు నిన్ను  చంపడానికి సిద్ధంగా ఉంది  అని చెబుతూ పిచ్చి నవ్వు నవ్వి వారికి  సైగ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో  రామరాజు నవ్వి సంధి విషయాలు మాట్లాడడానికి అని పిలిచి ఇలా ప్రవర్తించడం మీ జాతి నీతి  మీ నీతి తెలియక ఇచ్చటకు వచ్చానని భ్రమలు పడకు  పిచ్చి కలలు కనకు మీ దుష్ట  యజ్ఞాల మేకలము అవుతామని  అనుకుంటున్నారేమో అది నీ కలలో  బ్రహ్మ  నేను విల్లు ఎక్కిపెట్టి  నీ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రాణాలను తీసివేసే పరిస్థితి తెచ్చుకోవద్దు  నేను ఒక్క సైగ చేస్తే  నా సోదరులు వచ్చి  మీ గొంతులకు కోస్తారు జాగ్రత్త అని హెచ్చరించాడు  ఆ చుట్టూ ఉన్న చెట్లపై కాచి ఉన్న వీర యోధులు విల్లులను ఎక్కిపెట్టి  సైనికుల వెనక సర్వాధికారి వెనుక నిలిచి ఉండి రాజజ్ఞ  నెరపుతున్న వారిని చూడగానే భయంతో మాటలు రాక  అప్పటివరకు బీరములు పలికిన వారి నోళ్లు కట్టుబడిపోయినాయి.


కామెంట్‌లు