పండుటాకులు;- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగాం-9640748497
కంటి చూపు ఆననోళ్లు
ఆశలన్నీ రాలినోళ్లు
మతిమరుపు వరమైనోళ్లు
రెండో బాల్యం పొడచూపిన
పండుటాకులు

వీరు తాము కన్న కొడుకులకు
కొడుకు లాంటి వాళ్ళు
తమ పిల్లవాళ్ళవోలే
ప్రేమగా చూడవలసిన
పెద్దవాళ్లు
వారే (వీరే)2మన అమ్మానాన్నలు

జాలిగా మన వైపు
చూసేటోళ్లు
ఎన్నో బాధలు అనుభవించినోళ్లు

స్వార్థపరులైన
కొడుకు కోడళ్ళ
ఆరళ్లకు బలైపోయినోళ్ళు
ఉన్నదంతా తమ పిల్లలకు పంచి
చేతిలో చిల్లిగవ్వలేనోళ్లు
వృద్ధాశ్రమంలో తలదాచుకునే వాళ్ళు
ఆకలి రోగాన్ని జయించలేక
కంచంలో కూడు వేసే నాథుడే కరువై
వీధి వీధి తిరిగి
బిక్ష మెత్తే
అందరూ ఉన్నాఎవరు లేని
అనాథలు వారు
ధనం ఉన్న నిర్భాగ్యులు వారు
కామెంట్‌లు