నిన్నటి కల రేపు నిజమవ్వాలి- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497

 నిన్నటి కల రేపు నిజమవ్వాలి
నేటి  నుండే మనమంతా సన్నద్ధం కావాలి
శోధించాలి ఏదైనా సాధించాలి
అవరోధాలు ఎన్ని ఉన్నా
అధిగమించి తీరాలి
ఆలోచనలు  మన సొత్తు
అమలు చేస్తే కావా అవి నూతన ఆవిష్కరణలు 
నిరాశ నిస్పృహ వీడి నీ గెలుపుకై పోరాడి
అంతిమ గమ్యం చేరాలి మన ఆశయం నెరవేరాలి
కాళ్లు చేతులు లేని వాళ్ళు
అద్భుతాలు సృష్టించారు
మన ప్రతి కల రేపది ప్రతీక కావాలి?
నిస్సారం చేయకు నీ బ్రతుకు
ఏలోపం లేని మొనగాడా?
మీనమేషాలు లెక్కిస్తావేరా?
సోమరితనం నువ్వు వీడితే
గెలుపును ముద్దాడేవు ఓ యోధుడా

కామెంట్‌లు