ఆకలిని నేను?!;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
ఆకలిని నేను
నాబాధను తీర్చకుంటే
 ఆవేశమౌతాను

పోరాట గీతమౌతాను

నిరసన జెండై
ఎగురుతాను

ధిక్కార స్వరమై

గొంతెత్తుతాను


ఇది సగటు జీవి
కడుపుమండిన ఆకలి

పనిలేనితనమే
ఆకలి

పనికి తగిన ప్రతిఫలం
దక్కని ఆకలి

దోపిడీ
వ్యవస్థకు
మోకరిల్లలేక

కుళాయి నీళ్ళు త్రాగుతూ
కాలం వెల్లదీస్తూ

ప్రాణాలరచేత
పట్టుకున్న
నిస్సహాయుడి
ఆకలి

ఈఆకలి దుఃఖం
ఎప్పుడుతీరునో?

ఏలెటోడే
సవతితల్లి ప్రేమ
చూపితే 

దరిద్ర నారాయణుల
ప్రేగులు తెగేఆకలి

ఈ ఆకలి కేకలు
ఆగాలంటే?

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
ప్రభుత్వ ప్రభుత్వేతర
సంస్థలు కల్పించాలి

మేమున్నామన్నా
భరోసా నివ్వాలి

ఎగుడు దిగుడు సమాజం
సమంకావాలి


కామెంట్‌లు