అవినీతి- అంకాల సోమయ్య - దేవరుప్పుల- జనగాం-9640748497
నీతిని మ్రింగిన
అవినీతి

ప్రగతి నిరోధకమైన
అవినీతి

ప్రభుత్వ
 జవాబుదారితనానికి
మాయనిమచ్చై(న)(కు)అధికారుల
సొంత వ్యాపార
మీ అవినీతి

ఏలెటోడే అనకొండైతే
అధికారి అములమాసైన
అవినీతి
అధికారి
బల్లక్రింది
వ్యవహారమే
ఈ అవినీతి
అధికారులకు
దోపిడీ వరదే 
ఈ అవినీతి
అవినీతి
రాత్రికి రాత్రే
శ్రీమంతులవ్వాలన్నా
అత్యాశ పరులైన
అధికారుల
ధనదాహమే
ఈ అవినీతి

ముందు శ్రీమంతుడు
నేర్పిన
టిప్పేకదా
ఈఅవినీతి

నేడు పేదోడు
ఇవ్వలేనంత
భారిమూల్యమైన
అవినీతి
దొరికితే దొంగ
లేకపోతే దొరలు వీరు

బడుగు జీవులు
బ్యాంకు లోను
ఇండ్ల కేటాయింపు
కొత్త పెన్షన్లు,
రిటైర్మెంట్ బెనిఫిట్స్
త్వరిత గతిన
పొందుటకై
ఇచ్చే నజరానే
ఈ పాడు అవినీతి

అసలు ను
మ్రింగే నకలే
అవినీతి

కాపాడే కంచే
చేను ను మేసే
నీతిమాలిననీతే
అవినీతి

జీతం కన్నా
గీతంమ్మీద ప్రేమెక్కువని
ముసిముసి గా నవ్వి చెబుతున్న
ముదనష్టపు అధికారుల
వ్యభిచారమే ఈ అవినీతి

ఇక్కడ వ్యవస్థ అంతా
కుళ్ళిపోలేదు కానీ
తులసి వనంలో గంజాయి
మొక్కలాంటి అవినీతి పరులను పట్టి 
శ్రీకృష్ణ జన్మస్థానం పంపించాల్సిందే

ఉత్తమ అధికారులు
ప్రజాసేవ కులు

అవినీతి అధికారులు ప్రజాప్రగతి నిరోధకులు

అవినీతి రహిత సమాజాన్ని
నెలకొల్పుదాం

అవినీతి జలగలను ఏరివేద్దాంకామెంట్‌లు