ఈచదువులకేది దిశదశ?!;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
 పని పాట చేసుకున్నా
బతికి బట్ట కట్టేటోళ్లం
ఏండ్ల కేండ్లు చదివి
నిరుద్యోగం బహుమానం గా
అందుకుంటిమి
అమ్మ నాన్నలు నే నేదో ఉద్దరిస్తానని
 నాన్న పోలంచెలుక ,అమ్మ నగనట్రా 
అమ్మి నా చదువులకు ఖర్చు చేసి
నా కొడుకుకు ఉద్యోగం వస్తుందని
పోయినవన్నీ రెట్టింపుగా తిరిగి వస్తాయని 
ఆశగా ఎదురు చూస్తున్నా  నిర్భాగ్యులు వారు
అమ్మానాన్న నన్ను క్షమిస్తారా?
మీకుచదువురాకపోవడంతోనే
నేనేం చెప్పినా నమ్మారు
ఇప్పటికీ నమ్ముతున్నారు
మీకు ఎలా చెప్పను
స్థిరచరాస్తులు లేని మనకు చదువు ఆర్థిక వనరు 
అవుతుందంటే నమ్మి డబ్బంతా  ఖర్చు బెట్టిస్తిని
ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేక
రాసిన పరీక్షల ఫలితం రాక
కొత్త నోటిఫికేషన్ల అప్లికేషన్లకు డబ్బులు లేక
ఈసారి డబ్బులు అడిగితే
ఉన్న ఒక్క ఆధారమైన
పాలిచ్చే ఆవు నమ్మాలి అని
అమ్మ కనుగుడ్ల నిండా నీళ్లు తీసుకున్నప్పుడు
పేదవానిగా‌ పుట్టినందుకు
నన్ను నేను తిట్టుకున్న
అక్షరం ఉన్న అజ్ఞానిగా జీవిస్తున్నానని
ఆత్మగౌరవం గల ఒక‌ పనిని
వెతుక్కొని అమ్మ నాన్నకు
 నేను భారం కావద్దని తీర్మానించుకున్నా
నా మీదే నాకు జాలి
నా మీదే నాకు ఏవగింపు
ఇక నాలో కలిగే సంఘర్షణకు
అడ్డుకట్ట వేస్తున్నా
ఏ యావలేకుండా 
బ్రతకాలా ?అంటూఎన్నో ప్రశ్నలు నాలో?
పుట్టినందుకు చచ్చేదాకా బతకాలి కదా!?
చచ్చినా బతకాలనుకున్నా
బతికి ఉండగా చచ్చేలా చేసిన
సంఘాన్ని నేను ఏమి అనగలను?
నాలో ఉన్నటువంటి భావావేశమంతా 
నా బాధల సునామీకి కొట్టుకుపోయింది
ఇప్పుడు అంతా  ఏఆలోచనలులేని నిస్సహాయత
ధైర్యం చేసి చావాలనుకుంటే
అక్షరం అడ్డొచ్చి
బ్రతుక్కి ఏదో ఒక ఆదెరువు
 చూసుకొమ్మన్నది2
మానవ జన్మ ఉత్తమోత్తమమైనదని
బ్రతికిచూపమని నాకే సవాలు విసిరింది 2


కామెంట్‌లు