స్మార్ట్ ఫోన్- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
 స్మార్ట్ ఫోన్ నా చేతిలోకి వచ్చాక
చేతిరాతకు దూరమవుతానేమో
స్మార్ట్ ఫోన్ నా చేతిలోకి వచ్చాక నాలోని సృజనాత్మకత
అడుగంటి పోతుందేమోనని భయమేస్తుంది
స్మార్ట్ ఫోన్ నా చేతిలోకి వచ్చాక
దగ్గర వాళ్ళు దూరమవుతున్నట్టు
దూరం వాళ్ళు దగ్గరవుతున్నరేమోనని ఆందోళన
మొదలవుతుంది
స్మార్ట్ ఫోన్ నా చేతిలోకి వచ్చాక
నా విస్తృతి పెరిగింది
ఈ పెరుగుదల పురోగమనమో
తిరోగమనమో నాకు అర్థం కాకుంది
ఏది ఏమైనా గూగుల్ గూటిలో
ఆన్లైన్ చక్ర బంధములో నా  గమ్యం ఎటో నేను తేల్చుకోలేని
అంతు చిక్కని సవాల్ ఇది
ఏదేమైనా రోట్లో తల దూర్చాక
రోకలిపోటు కు జడిస్తే ఎలా!


కామెంట్‌లు