మేధ బోధ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
తొలిచేది మేధ
నిలిచేది బోధ
పుస్తక సమూహ గేహంలో 

మస్తిష్క హృదయాల 
లయాంతరంగం పుస్తకం
ఆత్మీయ ఆలోచన లతలల్లిన నేస్తం

నిగికీ నేలకూ నడుమ
తెగని అక్షరదారాల నిచ్చెన దారి
చలన సంచలనాల కాంతి పుంజం
లిపి ఏదైనా మనిషిని కలిపిన జ్ఞానలేఖ

మందార మకరందమాల గీతం మలయ మారుతం సంగీతం
కళల తేలియాడు సినారె సామల
దివ్య కాంతి పరిచిన విశ్వనాథ
వేయిపడగలు అనువాద తెలుగు నేత్రం  
భారత రత్న ఠీవి మన పివీ పుస్తక తేజం

మనసు నేర్వని ఈత నేర్పునిలా
వికసిత విరిపూత స్థలి పుస్తకమైత్రి
విరచిత మూర్తుల పుస్తకాలే సమూహ సంగమ సందేశాత్మక దీపాలు


కామెంట్‌లు