రెండు దృశ్యాలు నాలుగు అక్షరాలు- డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
ఒక అందమైన చెట్టది
గుండె కొమ్మల ఒంటరి నీడలేక 

ఆకులేని బట్టతల చెట్టిది
మైదానం పరిచిన చేతుల నీడచేరి

మనసు గీచిన బొమ్మకు
తెలుసు బొమ్మలోని మనసు

మనిషి నాటిన

నీడకు తెలుసో లేదో
లోపలిమనిషి నీడ చెట్టని

బంధాలూ అందాలు అల్లికైన అడవి సొంతం 
ఆంతర్యం మౌనగానం
లోపల చిరునవ్వుల శబ్దార్ణవం 

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Simile comparing the lonely old tree with the true inner self is beautiful.Novek concept and distinct style of expression.vongrats to the poet.