\🪷శరత్కాలము నందలి
పున్నమి చంద్రుని వలె
ప్రకాశించుచుందు వీవె!
వందనము శారదాంబ!
🪷చల్లని చూపులతోను
అనుగ్ర హిoపుము మమ్ము !
జయ పూర్ణెందు వదన!
జగదాంబ! శారదాంబ!
( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🔆"శారద" నామము.. సరస్వతీదేవి నామావళి లో సుప్రసిద్ధమైనది! "వాక్" అనగా పలుక బడునది! కనుక,"వాణి"! భాషింప బడునది! కనుక, "భాష" అని పేరు!
🔆శరదృతువు... ఆరుఋతువులలో.. నాలుగవది! ప్రకృతి ఆహ్లాద కరంగా, మనోల్లాసంను హృదయానందంను కలిగించుతుంది! ఆ విధంగా.. సరస్వతీ దేవి.. శరత్ పౌర్ణమి వెన్నెలలా వికసించిన చిరునగవుతో; చల్లని చూపులను ప్రసరింప చేయునది! పద్మమువంటి సుందరమైన ముఖముతో, పద్మమును ఆసనముగా కలిగిన బ్రహ్మదేవునకు పత్నియైనది! ఆ పలుకుల తల్లిని... విద్యాబుద్ధులు కొరకు ఉపాసించు చున్నాను! అని, కవులు, కళాకారులు, విద్యార్థులు ప్రార్థించు చున్నారు!
🌻శరదిందు వికాస మందహాసాం
స్పురదిందీవర లోచనాభిరామాం!
అరవింద సమాన సుందరాస్యాం
అరవిందాసన సుందరీ ముపాసే!
(...ప్రార్థనా శ్లోకము.,)
🚩 తేట గీతి పద్యము
శరదృతువున పున్నమినాటి చంద్రు నగవు
చంద్రికలబోలు దరహాస సంపదయును
కలిగి ఉండెడు, వాణిని కమలముఖిని,
బ్రహ్మ రాణిని ధ్యానింతు పరమ భక్తి౹౹
( డా. శాస్త్రుల రఘుపతి.,)
**********
🚩కంద పద్యము
చిరునవ్వు లొల్కు వాణీ!
మురిపెము హిమశైలవర్ణ ముగ్దకు నతులున్!
తరుణీ! హే కమలానన!
వరముల నందించు జనని! వందన శతముల్!!
( అవధాని, మాడుగుల నారాయణ మూర్తి.,)
🕉️శ్రీవాణి! జయ వాణి! జయజయ వాణి!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి