"శంకరప్రియ వృత్తం" పరిచయం- "కవి మిత్ర" శంకర ప్రియ.,శీల., - సంచార వాణి:- 99127 67098
 👌అనంత ఛoదస్సు లోని
     ప్రాచీనమైన పద్యము!
     "శంకరప్రియ వృత్తము"!
     ఓ ఆత్మ బంధువులార!
         ( అష్టాక్షరీ గీతి., )
🔆"అనంత: ఛంద:సౌరభం" అను బృహద్గ్రoధమును, సంకలనం కావించారు, సాహితీ బంధువులైన, "ఛందశ్శాస్త్ర రత్నాకర" శ్రీతోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మగారు. వారు.. ప్రాచీన గ్రంధములను పరిశోధించి; వాటిలో నుండి ... "శంకరప్రియ వృత్తo"ను పరిచయం కావించారు! ఇది.. సప్త(7) వర్ణములు కలిగిన పద్యరత్నము!    
🪷పద్య లక్షణం:-
     "త"గణం - "ర"గణం - "ల"ఘువు.. వెరశి = సప్త (7) వర్ణములే "శంకర ప్రియ వృత్తం"! దీనికి.. ప్రాస నియమము కలదు. యతి నియమము లేదు.
       🪷ఇష్ట దైవ ప్రార్ధన     
     శ్రీకంధరా! మహేశ!
 శ్రీకాలకాల! రుద్ర!
     నీకల్మి పొందగల్గ
 నేకూర్తు వందనమ్ము!
        (...డా. శాస్త్రుల రఘుపతి )  
             🌻(2)    
    శ్రీరుద్ర! వీర భద్ర!
 కారుణ్య మూర్తి వీవె!
    ఆరాధ్య దైవ మీవె!
 మా రేడు నీవె సోమ!
       (...శంకర ప్రియ ,)
               🌻(3)
     శ్రీవిఘ్నరాజ! నిన్ను
నే వేడుకొందు స్వామి!
    యే విఘ్నమంచు రాక
మావైపు నుండుమంచు!
       (... జి. లింగేశ్వర శర్మ.,)
               🌻(4
    శ్రీవాణి! నిన్ స్మరింతు 
నా వేదనన్ గణించి 
    నీవే ననున్ వరించ 
నావందనమ్ము లిత్తు!
   (...అవధాని, బొల్లాప్రగడ  శశిశర్మ., )

కామెంట్‌లు