అమ్మ ప్రేమ (మణిపూసలు);-మిట్టపల్లి పరశురాములు- మణిపూసలకవిభూషణ- సిద్దిపేట- చరవాణి:9949144820
అమ్మ మనసు కమ్మదనము!
నాన్న మాట వెచ్చదనము!
అమ్మ జోల పాడగా!!
జీవనమే పచ్చదనము!!

పల్లె మనకు తల్లిరా!
ఊయలూపిపెంచురా!
మమతల పొదరింటిలోన!
అమ్మ మనకు తోడురా!!

అమ్మ మనకు అండగున్న!
బతుకంత పండుగన్న!
ఆమె ప్రేమ లేక పోతె!
జీవితమే దండగన్న!!
  
అమ్మ మనసు చల్లన
ఆమె మెండు దీవెన
ప్రతి బిడ్డ కునుండగాను
ప్రతిరోజుపండుగనె

అమ్మ మొదటి ఆదిగురువు
అమ్మ మనకు బ్రతుకు దెరువు
ఆమె లేని జీవితాన  
ఉండబోదు బ్రతుకుదెరువు

నవమాసములుమోయునది
ప్రేమ మీరను పెంచునది
కనిపెంచినదైవమోయి
కంటిరెప్పలకాయునది

మల్లెపూలతెలుపుకన్న
తెల్లనైనమంచుకన్న
అమ్మ ప్రేమ మధురమోయి
తీయనైనతేనెకన్న

అమ్మ ఒడియె మొదటిబడి
అక్షరములునేర్పుబడి
అమ్మజ్ఞానమెంతొగొప్ప
జగతిలోనదొరకదండి

అమ్మబాటనడవవోయి
ఆమెచెప్పెమాటనోయి
పాటించగనుతప్పకుండ
కలిగించును మనకుహాయి
                **


కామెంట్‌లు