చిరు గుండె ఆశ;- -గద్వాల సోమన్న,9966414580
పాపాయి మోములో
చిరు దరహాసంలా
అనురాగ తోటలో
ప్రసరించు తావిలా

గురువుల సన్నిధిలో
విజ్ఞాన జ్యోతిలా
చదువులమ్మ బడిలో
అక్షర మాలలా

గగనమ్మ గుండెలో
మెరిసేటి తారలా
క్షీరసాగరంలో
చిందేటి తరగలా

అలా కావాలని వుంది
మేలు చేయాలని ఉంది
ఉన్న చిన్న బ్రతుకులో
మేలి మనిషి జన్మలో


కామెంట్‌లు