అక్షరాలాభిలాష;- -గద్వాల సోమన్న,9966414580
కొలువుము గురుదేవులను
తలచుము తల్లిదండ్రులను
పుణ్యాత్ములు వారు కదా!
ధన్యమగు బ్రతుకులు సదా!

వదిలివేయుము కలతలను
అదుపు చేయుము మనసులను
పొదుపు చేస్తే జీవితాన!
కుదుపు ఉండదు కుటుంబాన!

వేడుము భగవంతున్ని
వీడుము  నైరాశ్యాన్ని
వాడుము తెలుగు వెలుగుల్ని
చూడుము గత వైభవాన్ని

కోరుము విశ్వశాంతిని
చేరుము మనశ్శాంతిని
పోరుచెంతకు నడవబోకు
ఊరు పేరు పాడుచేయకు


కామెంట్‌లు