అక్షరాల హితవు;- -గద్వాల సోమన్న,9966414580
అక్షరాల తోరణాలు
మది తలుపుకు కట్టుకో!
అందమైన భావాలు
మస్తకంలో నింపుకో!

సమాధాన పావురాలు
గృహం గూటిలో పెంచుకో!
పవిత్రమైన బంధాలు
తీగలాగ అల్లుకో!

ప్రకృతిలోని అందాలు
పదిలంగా దాచుకో!
మంచి వారి స్నేహాలు
పది కాలాలు నిలుపుకో!

హాని చేయు కోపాలు
ఆదిలోనే త్రుంచుకో!
మదిని రాగ ద్వేషాలు
తక్షణమే వదులుకో!

చక్కనైన కుటుంబాలు
మక్కువతో చూసుకో!
అందరితో సంతోషాలు
అనుదినమూ పెంచుకో!


కామెంట్‌లు