విన్నపాలు;- -గద్వాల సోమన్న,9966414580
పువ్వులా నవ్వరా!
దివ్వెలా వెలుగరా
గువ్వలా విహరించి
మువ్వలా మ్రోగరా

మొక్కలా ఎదగరా!
చుక్కలా మెరియురా!
చక్కని త్రోవలోన
పక్కాగా బ్రతుకరా!

హద్దులో ఉండరా
శ్రద్ధగా చదవరా!
పెద్దలను పూజించి
వృద్ధిలో సాగరా!

తల్లి మాట వినరా!
మల్లెలా పూయరా!
ఎల్లరికి సాయపడు
పల్లెలా మారరా!


కామెంట్‌లు