సాగర తీరం మనోహరం;- -గద్వాల సోమన్న,9966414580
చల్లని సాగర తీరం
చూడగ అతి మనోహరం
బాపును మనసున భారం
అనారోగ్యమే దూరం

వీచే పిల్ల తెమ్మెరలు
తాకును మెత్తగ మనసులు
ఎగిసి పడే కెరటాలు
నేర్పును ఎన్నో పాఠాలు

చక్కని పరిసర దృశ్యాలు
దైవ సృష్టికి సాక్ష్యాలు
అద్భుతమైన తీరాలు
దోచును మానవ హృదయాలు

గొప్పవి సాగర తీరాలు
పర్యాటక ప్రదేశాలు
కడలి సంపద కోకొల్లలు  
మానవాళికి లాభాలు


కామెంట్‌లు