మనోవాంఛ;- -గద్వాల సోమన్న,9966414580
మల్లెలోని తావిలా
పల్లెసీమ సొగసులా
ఎల్లరికీ ఉపకరిస్తా!!
తల్లిలోని ప్రేమలా

చెట్టు మీద ఫలంలా
గట్టు మీద తరువులా
గట్టి మేలు తలపెడుతా!!
మట్టిలోని సారంలా

వెన్నెలమ్మ జల్లులా
వెన్న ముద్ద గుణంలా
మిన్నగా ఉంటాను!!
కన్నవారి మనసులా

దివ్వెలోని కాంతిలా
బువ్వలోని శక్తిలా
నవ్వుల పువ్వునౌతా!
మువ్వలోని నాదంలా


కామెంట్‌లు