పిల్లల ఆదర్శం...;- -గద్వాల సోమన్న,9966414580
పసి పిల్లల తీపి పలుకులు
చిలుకమ్మ  విని నేర్చుకుంది
అందాల బుడిబుడి నడకలు
సెలయేరు పరుగులకబ్బింది

చిన్నారుల ముద్దు కులుకులు
నెమలమ్మ అనుకరించింది
వారి మోముల చక్కదనం
జాబిలమ్మ పులుముకుంది

బాలల చిరు దరహాసాలు
తారకమ్మల వశమైంది
వారి పవిత్రమైన బుద్ధులు
పావన గంగాజలమైంది

పసికూనల ఊసులన్నీ
తీయ తీయని  స్వప్నమైంది
సదనంలో నడిచి నడిచి
కోలాహలంగా మారింది


కామెంట్‌లు