జీవకోటికి పాఠాలు;- -గద్వాల సోమన్న,9966414580
తీరం చేరాలనే
అలల ఆరాటం చూడు
అపజయాలెదురైనా
వాటి పోరాటం చూడు

పుడమి పొరలు చీల్చుకుని
వచ్చే విత్తును చూడు
మట్టి తల్లితో వాటి
విలువైన పొత్తును చూడు

కలసికట్టుగా పామును
చంపే చీమలను చూడు
పొదుపు విలువను నేర్పే
వాటి క్రమశిక్షణ చూడు

ముద్ద కూడు తిని కాయు
కుక్క విశ్వాసం చూడు
తన కూతతో పల్లె నిదుర
లేపు కోడిపుంజును చూడు

జీవకోటికవి పాఠాలు
స్వీకరిస్తే లాభాలు
దిద్దుకున్న బాగుపడును
శ్రేష్టమైన జీవితాలు


కామెంట్‌లు