ప్రాసాక్షర గేయం;- -గద్వాల సోమన్న,9966414580
వెలుగులీను భానులం
కొలనులోని కలువలం
తెలుగు తల్లి బిడ్డలం
గెలుపొందిన వీరులం

వనంలోని పూవులం
మనంలోని  మమతలం
దినకరుని కిరణాలం
పనస పళ్ళు విత్తులం

తరువులోని ఫలములం
చెరువులోని జలములం
గురుదేవుల శిష్యులం
కరుణామృత జల్లులం

పొలంలోని పైరులం
గళంలోని మధురిమలం
సిరిమల్లె తావులం
వరిచేను సొగసులం


కామెంట్‌లు