మంచి మాటల ముత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఆత్మీయత బంధము
అనురాగము గంధము
అమూల్యము సుగుణాలు
అర నవ్వులు అందము

అపకారము హేయము
ఉపకారము శ్రేష్టము
మానవ జీవితాన
సహకారము హేమము

దాతృత్వము పుణ్యము
కల్గియున్న ధన్యము
తప్పరాదు న్యాయము
పాటించుము ధర్మము

హానికరము కోపము
చూడగా వికారము
వదిలినచో క్షేమము
విలువైనది శాంతము


కామెంట్‌లు